Janasena: తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ హడావిడి మొదలైంది.. పట్నాన్ని వదిలి పల్లెటూరు బాట పట్టారు ప్రజలు.. ఏడాది ఓసారి వచ్చే పండుగను కుటుంబ సభ్యుల సమక్షంలో.. పుట్టిన ఊరిలో జరుపుకోవడానికి పల్లె బాట పడుతున్నారు.. దీంతో.. హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లే రహదారిపై రద్దీ పెరిగింది.. మరోవైపు.. పండుగను పురస్కరించుకుని జనసేన పార్టీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, కటౌట్లు ఆసక్తికరంగా మారియి.. హైదరాబాద్-విజయవాడ రహదారిపై పెద్ద ఎత్తున జనసేన ఫ్లెక్సీలు, కటౌట్లు పెట్టింది.. నందిగామ వద్ద జనసేన ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.. వాటిలో సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూనే.. వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు చేస్తోంది జనసేన.. ఏపీలో రోడ్లు సరిగా లేవు జాగ్రత్త అంటూ వాహనదారులకు జనసేన సూచనలు చేస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.. సొంతూరికొచ్చే సంతోషంలో జోరు పెంచొద్దు .. ఏపీ రోడ్లు బ్రేకులు వేస్తాయి.. జాగ్రత్తగా ఇంటికి చేరండంటూ సూచనలు చేస్తూనే.. ఆంధ్రప్రదేశ్‌లోని రోడ్ల పరిస్థితి వివరిస్తూ.. వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తోంది జనసేన పార్టీ. ఇక, వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని టీడీపీ-జనసేన నిర్ణయానికి రావడం.. ఉమ్మడి కార్యాచరణతో ముందుకు సాగుతోన్న విషయం విదితమే కాగా.. జనసేన ఫ్లెక్సీలో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫొటోలను కూడా పొందుపరిచారు.
Read Also: Bat Symbol Case: పాకిస్థాన్ లో బ్యాట్ సింబల్ గుర్తు కేటాయింపుపై వివాదం..