Site icon NTV Telugu

Pawan Kalyan: తీవ్ర జ్వరంతో బాధపడుతున్న పవన్‌ కళ్యాణ్!

Pawankalyan Janasena

Pawankalyan Janasena

Pawan Kalyan: జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. ఇవాళ పవన్‌కళ్యాణ్‌ లోకేష్‌ పాదయాత్ర యువగళం విజయోత్సవ సభ కోసం విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లికి రావాల్సి ఉంది. అయినా లోకేష్ కార్యక్రమంలో పాల్గొనటానికి పవన్ విశాఖ బయల్దేరారు. గన్నవరం విమానాశ్రయం నుంచి విశాఖ పవన్‌ కళ్యాణ్ బయల్దేరారు. ఈరోజు ‘యువగళం- నవశకం’ సభలో పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు. అయితే, నిన్న రాత్రి నుంచి ఆయన జ్వరం కారణంగా స్వల్ప అస్వస్థతతో ఉండడంతో సభకు కొంచెం ఆలస్యంగా చేరుకునే అవకాశం ఉంది.

Read Also: China : భూకంపం, చలి ప్రభావం తర్వాత ఇప్పుడు చైనా పరిస్థితి ఎలా ఉందంటే ?

టీడీపీ నేత నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర ముగింపు విజయోత్సవ సభ నేడు జరగనుంది. విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లి వద్ద భారీ బహిరంగ సభను టీడీపీ శ్రేణులు నిర్వహించనున్నారు. ఈ భారీ బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఇరు పార్టీల శ్రేణులు పాల్గొననున్నారు. టీడీపీ, జనసేన శ్రేణులు భారీగా పాల్గొననున్నాయి.

Exit mobile version