జనసేన అధినేత పవన్ కల్యాణ్.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న పవన్.. గురువారం ఉదయం నడ్డాతో భేటీ అయ్యారు. గంటకు పైగా కొనసాగిన ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, బీజేపీ రాష్ట్ర అధ్యక్ష మార్పు తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు, ఎన్నికలకు సమాయత్తం అవ్వాల్సిన వ్యవహారంపై చర్చించినట్లు సమాచారం తెలుస్తోంది. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితులను కూడా నడ్డా దృష్టికి పవన్ తీసుకెళ్లినట్టు సమాచారం.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. మంగళవారం ఎన్‌డీఏ సమావేశంలో పాల్గొనేందుకు సోమవారం సాయంత్రమే ఢిల్లీ చేరుకున్నారు. బుధవారం కేంద్ర మంత్రులు అమిత్ షా, మురళీధరన్‌తో పవన్ సమావేశం అయ్యారు. 25 నిమిషాల ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చలు జరిపారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, సీఎం వైఎస్ జగన్ వ్యవహారంపై చర్చలు సాగించినట్లు తెలిసింది. పవన్ ఢిల్లీ పర్యటన ముగించుకొని విజయవాడ బయలుదేరారు.
Also Read: ICC Test Rankings: ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో టాప్ 10 లోకి రోహిత్ శర్మ
Also Read: Stuart Broad 600 Wickets: టెస్టు క్రికెట్‌లో సరికొత్త చరిత్ర సృష్టించిన స్టువర్ట్ బ్రాడ్!