పిఠాపురం నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడతారని జనసేన ప్రకటించింది. వారాహి వాహనం నుంచి పవన్ కల్యాణ్ ప్రచారం మొదలు పెడతారని తెలిపింది. పిఠాపురం కేంద్రంగానే రాష్ట్రవ్యాప్త ప్రచారం చేపట్టనున్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఈ క్రమంలో.. పవన్ ఎన్నికల ప్రచారంపై జనసేన కసరత్తు ప్రారంభించింది. శక్తిపీఠం కొలువైన క్షేత్రం.. శ్రీపాద శ్రీవల్లభుడు జన్మించిన పవిత్ర భూమి అయిన పిఠాపురం నుంచే ప్రచారం మొదలుపెట్టాలని పవన్ నిర్ణయం తీసుకున్నారు. పురుహూతిక దేవికి పూజలు నిర్వహించి వారాహి వాహనం నుంచి పవన్ కల్యాణ్ ప్రచారం ప్రారంభించనున్నారు. పిఠాపురంలో మూడు రోజుల పాటు పవన్ ఎన్నికల ప్రచారం నిర్వహించనుండగా.. నియోజకవర్గ ముఖ్య నాయకులు, మండల నాయకులతో పవన్ కల్యాణ్ భేటీ కానున్నారు.
TDP: ఈసీకి టీడీపీ ఫిర్యాదు.. కారణమేంటంటే..?
ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. పిఠాపురం తాను పోటీ చేస్తున్న స్థానం కావడంతో వైసీపీ ఎన్నో పన్నాగాలు పన్నుతోందని తెలిపారు. ప్రతి దశలోనూ అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించబోతున్నాయని.. ఇందుకోసం సాగిస్తున్న ఈ సమరంలో కచ్చితంగా విజయం తమదేనని పేర్కొన్నారు. పిఠాపురం నుంచే జనసేన శంఖం పూరిస్తుంది.. ఈ విజయ నాదం రాష్ట్రం నాలుగు వైపులా వినిపించాలని పవన్ కల్యాణ్ తెలిపారు. ఎన్నికల నియమ నిబంధనలు పాటించడం పైనా పూర్తి అవగాహనతో ఉండాలని జననసైనికులకు సూచించారు.
CSK vs RCB: చెన్నై వర్సెస్ ఆర్సీబీ.. ప్రారంభ మ్యాచ్‌లో ప్లేయింగ్-11?
