Site icon NTV Telugu

JanaNayagan : జననాయగన్.. తెలుగు రైట్స్ నాగవంశీ నుండి.. దిల్ రాజు చేతికి

Tollywood (1)

Tollywood (1)

విజయ్ హీరోగా తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘జననాయకన్ ’. హెచ్. వినోద్  తెరకెక్కిస్తున్న ఈ మూవీపై ఇప్పటికే  అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. తెలుగులో ఈ సినిమాను జననాయకుడుగా తీసుకువస్తున్నారు.తమిళంతో పాటు తెలుగు వెర్షన్‌లో సంక్రాంతి కానుకగా జనవరి 9న ఒకేసారి విడుదల కానుంది.   ఈ  సినిమా తెలుగు హక్కులను సితార ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీ రూ. 9 కోట్లకు కొనుగోలు చేశారని గతంలో వార్తలు వచ్చాయి. విజయ్ నటించిన లియో సినిమాను కూడా అప్పట్లో నాగవంశీ కొనుగోలు చేసి రిలీజ్ చేశాడు. ఇప్పుడు జననాయకుడు హక్కులు కూడా నాగవంశీ చేతికి వెళ్లడంతోభారీ రిలీజ్ ఉంటుందని అనుకున్నారు.

అయితే తాజా అప్‌డేట్ ప్రకారం,  సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నాగవంశీ తెలుగు రాష్ట్రాల్లో ‘జననాయకన్’ డిస్ట్రిబ్యూషన్  నుండి తప్పుకున్నారు. సంక్రాంతి ఇతర హీరోల భారీ చిత్రాలు రిలీజ్ ఉండడమో మరే ఇతర కారణాల ఏమోకానీ నాగవంశీ జననాయకుడు రైట్స్ డీల్ క్యాన్సిల్ చేశాడు. ఈ నేపథ్యంలో జననాయకుడు  తెలుగు రైట్స్ కోసం టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు రంగంలోకి దిగారు. తెలుగు రాష్ట్రాల్లో కీలకమైన నైజాంతో పాటు ఉత్తరాంధ్ర ప్రాంతాల థియేట్రికల్ హక్కులను దిల్ రాజు సొంతం చేసుకున్నారు. ఆయన సంస్థ svc ద్వారా ఈ సినిమా తెలుగు స్టేట్స్ లో రిలీజ్ కాబోతుంది.  విజయ్ కెరీర్‌లోనే కీలక చిత్రంగా భావిస్తున్న ‘జననాయకన్’ తెలుగు మార్కెట్‌లో ఎంతటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి. దిల్ రాజు వంటి అనుభవజ్ఞుడైన నిర్మాత డిస్ట్రిబ్యూషన్ బాధ్యతలు తీసుకోవడం సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచింది.

Exit mobile version