Medical Assistance: హీరో ప్రభాస్, సోనూసూద్‌లు సాయం చేయాలంటూ పాదయాత్ర
- వైద్య చికిత్స కోసం ఆదుకోవాలని సినీ నటులకు విన్నవిస్తున్న యువకుడు పాదయాత్ర
- వెంకటాద్రిపేట గ్రామం నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్ర
- ప్రభాస్, సోనూ సూద్‌ల ఫ్లెక్సీలతో సహాయం కోరుతూ నడక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Medical Assistance: జనగామ జిల్లా చిల్పూర్ మండలంలోని వెంకటాద్రి పేట గ్రామానికి చెందిన రాజు అనే యువకుడు ఆరోగ్య సమస్యలతో తీవ్రంగా బాధపడుతున్నాడు. మెడ నరాలలో సమస్య కారణంగా తీవ్రమైన క్షీణతకు గురవుతున్న ఆయన, వైద్య చికిత్సకు అవసరమైన ఖర్చును భరించలేని పరిస్థితిలో ఉన్నాడు. రాజుకు అవసరమైన చికిత్స కోసం దాదాపు ఆరు లక్షల రూపాయల ఖర్చు అవుతుందని అంచనా. గ్రామీణ ప్రాంతంలో నివసిస్తున్న రాజు ఆ మొత్తంను భరించే ఆర్థిక స్థితిలో లేడు. ఈ క్రమంలో తన సమస్యను ప్రజల దృష్టికి తీసుకెళ్లేందుకు ఓ అసాధారణమైన మార్గాన్ని ఎంచుకున్నాడు.
Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నాని ఎలా అయ్యారో చూడండి.. కొత్త ఫొటో వైరల్!
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్‌బాల్ మ్యాచ్‌పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ.. ఎవరంటే..
తన బతుకుదెరువు కోసం, తన వైద్య ఖర్చులకు కొంత ఆర్థిక సహాయం అందాలని కోరుతూ, సినీ నటులు సోనూ సూద్, ప్రభాస్‌లను కలిసేందుకు రాజు పాదయాత్రగా హైదరాబాద్‌కు బయలుదేరాడు. వెంకటాద్రి పేట గ్రామం నుంచి ప్రారంభించిన ఈ ప్రయాణంలో, హీరోల ఫ్లెక్సీలను తనతో కలిపుకొని, వారిని కలవాలన్న ఆకాంక్షతో మైళ్ల కొద్దీ నడుస్తున్నాడు.
సోనూ సూద్ ఇప్పటికే ఎంతోమంది అవసరంలో ఉన్నవారికి సహాయం చేసిన నేపథ్యంలో, అతనిని చేరుకోవాలని రాజు భావిస్తున్నాడు. అలాగే టాలీవుడ్ స్టార్ ప్రభాస్‌ను కూడా కలిసి తన ఆరోగ్య పరిస్థితిని వివరించాలని అతని ఆశ. “నన్ను ఆదుకోండి… నా జీవితాన్ని నిలబెట్టండి” అనే పిలుపుతో రాజు తను నడుస్తున్న ప్రతి అడుగులో ఓ ఆశను మోస్తున్నాడు. రాజు చేసిన ఈ వినూత్న ప్రయత్నం ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశమైంది. సోషల్ మీడియాలో కూడా ఇతని పాదయాత్ర గురించి కొంత ప్రచారం జరుగుతోంది.
Tuni Train Burning Case: తుని రైలు దగ్ధం కేసుపై సర్కార్ కీలక నిర్ణయం.. ఆ ఆలోచన లేదు..!
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్‌బాల్ మ్యాచ్‌పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!