జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభ నుంచి వెళ్తూ కార్యకర్త హఠాన్మరణం చెందారు. అమలాపురం నియోజకవర్గం ఈదరపల్లికి చెందిన జనసేన పార్టీ కార్యకర్త అడపా దుర్గాప్రసాద్ పార్టీ ఆవిర్భావ సభ నుంచి తిరిగి వెళ్తూ హఠాన్మరణం చెందినట్లు పార్టీ పేర్కొంది. ఈ ఘటన ఎలా జరిగింది అనే అంశంపై క్లారిటీ లేదు. కాగా.. ఈ ఘటనపై జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ విషయం తనకు తెలిసి చింతిస్తున్నానని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించారు. బాధిత కుటుంబానికి జనసేన పార్టీ అన్ని విధాలా అండగా ఉంటామని పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారు.
READ MORE: Ambati Rambabu: పవన్ కళ్యాణ్ ఉపన్యాసం కనీసం ఆయనకైనా అర్థమైందో.. లేదో!
కాగా.. ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లా పిఠాపురంలో జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభ నిర్వహించిన విషయం తెలిసిందే. పార్టీ అధ్యక్షుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ.. కీలక విషయాలు ప్రస్తావించారు. పార్టీ ఆవిర్భావం నుంచి 12 సంవత్సరాల పాటు సాగిన తన రాజకీయ ప్రయాణం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు పవన్ కళ్యాణ్. తన పార్టీ ఆవిర్భావం, రాజకీయ ప్రయాణం గురించే కాకుండా.. అంతకుముందు చోటుచేసుకున్న కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు. అందులో భాగంగా.. ప్రజాయుద్ధ నౌక గద్దర్‌ను గుర్తుచేసుకోవటమే కాకుండా.. ఆయనతో తన పరిచయం, స్నేహం, అనుబంధం గురించిన ఎవరికీ తెలియని విషయాలను కూడా పవన్ కళ్యాణ్ తెలిపారు.