Site icon NTV Telugu

Nagarjuna Sagar: వివాదం ఏదైనా రెండు ప్రభుత్వాలు కూర్చొని మాట్లాడుకోవాలి : జానారెడ్డి

New Project (5)

New Project (5)

Nagarjuna Sagar: తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా నీటి విడుదల అంశం మరోసారి రచ్చ అవుతోంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్దకు పోలీసులు భారీగా చేరుకున్నారు. తెలంగాణ పోలీసుల ఆధీనంలో ఉన్న నాగార్జున సాగర్ డ్యామ్ కు నీటిని విడుదల చేయకపోవడంతో ఏపీకి నీటి కష్టాలు ఎదురవుతున్నాయని ఏపీ పోలీసులు ఆందోళన చెందుతున్నారు. అదే సమయంలో తెలంగాణ పోలీసులు కూడా పెద్దఎత్తున అక్కడికి రావడంతో ఒక్కసారిగా అక్కడ వాతావరణం ఉద్రిక్తంగా మారింది.

Read Also:Bigg Boss 7 Telugu: ఫినాలే అస్త్ర టాస్క్‌లో టాప్ లో అమర్.. డెడ్ లైన్ లో ఆ కంటెస్టెంట్స్..

నాగార్జునసాగర్ డ్యాం వివాదంపై పోలీసుల మోహరింపు వ్యవహారంలో జిల్లా నేత కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. తర్వాత స్థానిక నేత కుందూరు జానారెడ్డి స్పందించారు. ఏపీ పోలీసులు డ్యాం పైకి రావడం సరైన చర్య కాదన్నారు. తెలంగాణ ఎస్పీఎఫ్ పోలీసులను గాయపరచడాన్ని ఖండించారు. ఇటువంటి ఘటనలు రెండు ప్రాంతాల మధ్య వివాదాలకు వైశమ్యాలకు కారణం అవుతాయన్నారు. వెంటనే తెలంగాణ లేదా ఆంధ్ర ప్రదేశ్ లేదా కృష్ణ రివర్ బోర్డు, లేదా కేంద్ర ప్రభుత్వం స్పందించాలని కోరారు. వివాదం ఏదైనా రెండు ప్రభుత్వాలు కూర్చొని మాట్లాడుకోవాలి. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల స్పందన తర్వాత మరో సారి మాట్లాడుతానన్నారు. రెండు ప్రాంతాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.

Read Also:Telangana Elections : ఓటింగ్ కు దూరంగా 30 శాతం మంది

Exit mobile version