Site icon NTV Telugu

Jana Nayagan : రిలీజ్ కు రెడీ అవుతున్న ‘జననాయగన్’

Jananayagan

Jananayagan

కోలీవుడ్ సూపర్ స్టార్ దళపతి విజయ్ నటిస్తున్న చివరి చిత్రం ‘జన నాయగన్’ విడుదల కోసం అభిమానులు కోటి కళ్లతో ఎదురుచూస్తున్నారు. రాజకీయ నేపథ్యంతో కూడిన ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే, గత కొంతకాలంగా ఈ సినిమా విడుదల తేదీ విషయంలో సందిగ్ధత కొనసాగుతున్న నేపథ్యంలో, తాజాగా ఒక క్రేజీ అప్‌డేట్ నెట్టింట హల్చల్ చేస్తోంది.

Also Read : Dhurandhar The Revenge : అక్కడ ఒక్కచోట 13 రోజుల్లో రూ. 360 కోట్లు వసూలు చేసిన ధురంధర్

వాస్తవానికి ఈ చిత్రాన్ని ఈ ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 9, 2026న విడుదల చేయాలని చిత్ర బృందం అన్ని ఏర్పాట్లు చేసుకుంది. కానీ చిత్రంలోని కొన్ని కీలక రాజకీయ డైలాగులు మరియు సన్నివేశాలపై సెన్సార్ బోర్డు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో పాటు కోర్టులో ఉన్న కొన్ని పెండింగ్ ఇష్యూస్ వల్ల నిర్ణీత సమయానికి సినిమా విడుదల కాలేదు. ఇది విజయ్ అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. తాజా సమాచారం ప్రకారం మేకర్స్ ఇప్పుడు సమ్మర్ విడతను లక్ష్యంగా చేసుకున్నారు. ముఖ్యంగా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రభావం సినిమాపై పడకుండా చిత్ర యూనిట్ జాగ్రత్త పడుతోంది. ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసిన వెంటనే అంటే ఏప్రిల్ 24న సినిమాను థియేటర్లలోకి తీసుకురావాలని నిర్మాతలు యోచిస్తున్నట్లు సమాచారం. ఈ తేదీన సినిమాను విడుదల చేయడం ద్వారా ఎన్నికల వేడిలో ఉన్న ప్రజలను థియేటర్లకు రప్పించవచ్చని భావిస్తున్నారు. విజయ్ సినిమా విడుదలైన వారం రోజుల వ్యవధిలోనే మరో స్టార్ హీరో ధనుష్ నటించిన ‘కరా’ ఏప్రిల్ 30న విడుదలకు సిద్ధంగా ఉంది. దీంతో ఏప్రిల్ ఆఖరి వారంలో బాక్సాఫీస్ వద్ద ఇద్దరు అగ్ర హీరోల మధ్య గట్టి పోటీ నెలకొననుంది. మరి సెన్సార్ అడ్డంకులు దాటుకుని ‘జన నాయగన్’ చెప్పిన తేదీకే వస్తుందో లేదో చూడాలి.

Exit mobile version