Jana Nayagan : రిలీజ్ కు రెడీ అవుతున్న ‘జననాయగన్’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ సూపర్ స్టార్ దళపతి విజయ్ నటిస్తున్న చివరి చిత్రం ‘జన నాయగన్’ విడుదల కోసం అభిమానులు కోటి కళ్లతో ఎదురుచూస్తున్నారు. రాజకీయ నేపథ్యంతో కూడిన ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే, గత కొంతకాలంగా ఈ సినిమా విడుదల తేదీ విషయంలో సందిగ్ధత కొనసాగుతున్న నేపథ్యంలో, తాజాగా ఒక క్రేజీ అప్డేట్ నెట్టింట హల్చల్ చేస్తోంది.
Also Read : Dhurandhar The Revenge : అక్కడ ఒక్కచోట 13 రోజుల్లో రూ. 360 కోట్లు వసూలు చేసిన ధురంధర్
Also Read
- Dussehra astrology: దసరా నుంచి ఈ 3 రాశుల వారికి త్రిగ్రాహి, లక్ష్మీనారాయణ, బుధాదిత్య యోగాలు..
- Redmi Pad 3 లాంచ్‌కు ముందు స్పెసిఫికేషన్లు లీక్.. 10,000mAh బ్యాటరీతో రాక!
- Sheikh Hasina: ‘చంపినా, అరెస్టు చేసినా వెనక్కి తగ్గను’.. బంగ్లాదేశ్‌కు వెళ్తానన్న హసీనా
- Kim Jong Un in Coma: కోమాలోకి కిమ్ జోంగ్ ఉన్..? ఉత్తర కొరియా నుంచి చైనాకు తరలింపు...!
వాస్తవానికి ఈ చిత్రాన్ని ఈ ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 9, 2026న విడుదల చేయాలని చిత్ర బృందం అన్ని ఏర్పాట్లు చేసుకుంది. కానీ చిత్రంలోని కొన్ని కీలక రాజకీయ డైలాగులు మరియు సన్నివేశాలపై సెన్సార్ బోర్డు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో పాటు కోర్టులో ఉన్న కొన్ని పెండింగ్ ఇష్యూస్ వల్ల నిర్ణీత సమయానికి సినిమా విడుదల కాలేదు. ఇది విజయ్ అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. తాజా సమాచారం ప్రకారం మేకర్స్ ఇప్పుడు సమ్మర్ విడతను లక్ష్యంగా చేసుకున్నారు. ముఖ్యంగా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రభావం సినిమాపై పడకుండా చిత్ర యూనిట్ జాగ్రత్త పడుతోంది. ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసిన వెంటనే అంటే ఏప్రిల్ 24న సినిమాను థియేటర్లలోకి తీసుకురావాలని నిర్మాతలు యోచిస్తున్నట్లు సమాచారం. ఈ తేదీన సినిమాను విడుదల చేయడం ద్వారా ఎన్నికల వేడిలో ఉన్న ప్రజలను థియేటర్లకు రప్పించవచ్చని భావిస్తున్నారు. విజయ్ సినిమా విడుదలైన వారం రోజుల వ్యవధిలోనే మరో స్టార్ హీరో ధనుష్ నటించిన ‘కరా’ ఏప్రిల్ 30న విడుదలకు సిద్ధంగా ఉంది. దీంతో ఏప్రిల్ ఆఖరి వారంలో బాక్సాఫీస్ వద్ద ఇద్దరు అగ్ర హీరోల మధ్య గట్టి పోటీ నెలకొననుంది. మరి సెన్సార్ అడ్డంకులు దాటుకుని ‘జన నాయగన్’ చెప్పిన తేదీకే వస్తుందో లేదో చూడాలి.
తాజావార్తలు
-
SS Rajamouli-Varanasi: ఆరేడు సినిమాలను కలిపి ఒకే చిత్రంగా.. ‘వారణాసి’పై రాజమౌళి ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
-
Dussehra astrology: దసరా నుంచి ఈ 3 రాశుల వారికి త్రిగ్రాహి, లక్ష్మీనారాయణ, బుధాదిత్య యోగాలు..
-
Redmi Pad 3 లాంచ్‌కు ముందు స్పెసిఫికేషన్లు లీక్.. 10,000mAh బ్యాటరీతో రాక!
-
Sheikh Hasina: ‘చంపినా, అరెస్టు చేసినా వెనక్కి తగ్గను’.. బంగ్లాదేశ్‌కు వెళ్తానన్న హసీనా
-
418 Trailer: నేను కచ్చితంగా తల్లినై తీరాలి.. బయపెట్టేస్తున్న ‘418’ ట్రైలర్!
ట్రెండింగ్
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..
-
India Playing XI: రోహిత్-గిల్ ఓపెనర్స్.. కోహ్లీ మూడో స్థానంలో.! 2027 ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేసిన టీమిండియా మాజీ ప్లేయర్.!
-
New Recharge Plans: డేటా అవసరం లేదా? కొత్త రీఛార్జ్ ప్లాన్స్ వచ్చేశాయ్.. రూ.185 నుంచి మొదలు.!
-
WPL 2027 Auction: 27 స్థానాల కోసం 146 మంది ప్లేయర్లు.. WPL వేలం తేదీ, వేదిక ఖరారు..!