J&K Cyber Security Move: జమ్మూకశ్మీర్ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. అక్కడ ఈ సేవలు బంద్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
J&K Cyber Security Move: జమ్మూకశ్మీర్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అన్ని ప్రభుత్వ విభాగాల్లో పెన్‌డ్రైవ్ వాడకాన్ని నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అలాగే అధికారిక సమాచార మార్పిడి కోసం వాట్సాప్ మెసేజింగ్ సర్వీసును కూడా నిషేధించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. సైబర్ దాడుల నేపథ్యంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆపరేషన్ సింధూర్ తర్వాత సైబర్ దాడులు పెరగడంతో సైబర్ భద్రతా ఉల్లంఘన భయాల మధ్య ఈ నిర్ణయం తీసుకున్నట్లు జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ కమిషనర్ సెక్రటరీ ఎం.రాజు ఉత్తర్వుల్లో తెలిపారు. కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూకశ్మీర్ ప్రభుత్వ సమాచారాన్ని పరిరక్షించడం, డేటా ఉల్లంఘనలను సాధ్యమైనంతమేర తగ్గించడం, మాల్వేర్ దాడుల్ని నివారించడం ఈ నిషేధం ప్రధాన ఉద్దేశం. దాంతో ప్రభుత్వ కార్యకలాపాల కోసం పెన్రైవ్ వాడకాన్ని నిషేధించాం. ఏదైనా అధికారిక సమాచార మార్పిడి కోసం వాట్సప్, ఇతర సోషల్ మీడియా వేదికలను వాడటాన్ని కూడా నిషేధించాం” అని పేర్కొన్నారు.
READ ALSO: Delhi High Court: రూ.20 వాటర్ బాటిల్‌కు 100 దేనికి? .. రెస్టారెంట్ల సంఘాలపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం
Also Read
- Jal Jeevan Mission 2.0: 27 లక్షల గ్రామీణ కుటుంబాలకు గుడ్‌న్యూస్.. రూ.30,156 కోట్లతో తాగునీటి పథకం..!
- Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
- 5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
- ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
ఈ ఏడాది ఏప్రిల్‌లో జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రదాడి జరిగిన సంగతి తెలిసిందే. దీనికి ప్రతీకారంగా భారత్ ‘ఆపరేషన్ సింధూర్’ చేపట్టింది. ఈ ఆపరేషన్‌లో భారత్ పాకిస్థాన్, పీఓకేలోని ఉగ్ర శిబిరాలే లక్ష్యంగా మెరుపుదాడులు చేసింది. అత్యంత కచ్చితత్వంలో కీలక ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది. దీంతో ఇరుదేశాల మధ్య కొన్ని రోజుల పాటు భీకర ఘర్షణ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. ఆపరేషన్ సింధూర్ సమయంలో జమ్మూకశ్మీర్ ప్రభుత్వానికి చెందిన పలు అధికారిక వెబ్‌సైట్లు ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ విభాగం సైట్లు సైబర్ దాడులకు గురయ్యాయి. వాటిని పునరుద్ధరించడంలో ఇప్పటికీ సమస్యలు ఎదురవుతున్నాయి. ప్రజాసేవలకు ఆటంకం ఏర్పడింది. ఆ సమయంలో పవర్ సెక్టార్‌పై రెండు లక్షల సైబర్ దాడులు జరిగాయని, అన్నింటిని అడ్డుకున్నామని కేంద్ర మంత్రి మనోహర్లాల్ ఖట్టర్ గతంలో వెల్లడించిన సంగతి తెలిసిందే.
READ ALSO: coconut auction ₹5.71 lakhs: కొబ్బరికాయకు రూ.5.71లక్షలు.. ఇది మామూలు టెంకాయ కాదు
తాజావార్తలు
-
Jal Jeevan Mission 2.0: 27 లక్షల గ్రామీణ కుటుంబాలకు గుడ్‌న్యూస్.. రూ.30,156 కోట్లతో తాగునీటి పథకం..!
-
India vs West Indies T20 Series: భారత్- వెస్టిండీస్ తొలి టీ20 మ్యాచ్ ఎప్పుడు? మొత్తం 5 మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదే
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
KBR పార్క్ చుట్టూ శాశ్వతంగా వన్‌వే.. 7 ఫ్లైఓవర్ల స్థానంలో ఒకే భారీ ఎలివేటెడ్ కారిడార్..
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
ట్రెండింగ్
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!