NTV Telugu Site icon

Encounter: కిష్త్వార్‌లో సైన్యం, ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్.. వీరమరణం పొందిన ఇద్దరు సైనికులు..

Encounter

Encounter

Encounter: జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదులపై కొనసాగుతున్న ఆపరేషన్‌లో ఇప్పటివరకు చాలా మంది ఉగ్రవాదులు హతమయ్యారు. అయితే ఇదే సమయంలో మన సైనికులు కూడా చాలా మంది వీరమరణం పొందారు. శుక్రవారం, జమ్మూ కాశ్మీర్‌ లోని కిష్త్వార్ జిల్లాలో సెర్చ్ ఆపరేషన్ సందర్భంగా.. భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. ఇందులో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. ఈ ఆపరేషన్‌లో నలుగురు ఆర్మీ సైనికులు కూడా గాయపడ్డారు. వారిలో ఇద్దరు చికిత్స పొందుతూ మరణించారు. రహస్య సమాచారం ఆధారంగా భద్రతా బలగాలు ఛత్రు ప్రాంతంలోని నైద్‌గామ్ ప్రాంతాన్ని చుట్టుముట్టి సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయని పోలీసు అధికారులు తెలిపారు.

ENG v AUS: ఆస్ట్రేలియాపై ఇంగ్లాండ్ విజయం.. అదరగొట్టిన లివింగ్‌స్టోన్‌..

ఛత్రు పోలీస్ స్టేషన్ పరిధిలోని నైద్‌గాం గ్రామ ఎగువ ప్రాంతంలోని పింగనల్ దుగడ్డ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాల సెర్చ్ పార్టీలకు, దాగి ఉన్న ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరిగినట్లు ఆయన తెలిపారు. ఇంటెలిజెన్స్ ఆధారంగా ఛత్రు ప్రాంతంలో పోలీసులతో కలిసి జాయింట్ ఆపరేషన్ ప్రారంభించినట్లు ఆర్మీ ఈ రాత్రి తెలిపింది. వైట్ నైట్ కార్ప్స్ ‘X’ పోస్ట్‌లో, ‘సాయంత్రం 3.30 గంటలకు ఉగ్రవాదులతో ఎన్‌కౌంటర్’ అని పేర్కొంది. ఈ కాల్పుల్లో నలుగురు సైనికులు గాయపడ్డారని, వారిలో ఇద్దరు తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మరణించారని చెప్పారు. ఎన్‌కౌంటర్‌లో వీరమరణం పొందిన సైనికుల పేర్లు నాయబ్ సుబేదార్ విపిన్ కుమార్, కానిస్టేబుల్ అరవింద్ సింగ్. కిష్త్వార్‌లో ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.

US election 2024: చర్చలో ఓడిపోయిన ట్రంప్ ఎన్నికల్లో గెలిచారు.. హిస్టరీ రిపీట్ కానుందా ?