Site icon NTV Telugu

JP Morgan: సార్వత్రిక ఎన్నికల వేళ మోడీపై జేపీ మోర్గాన్ సీఈవో ప్రశంసలు

Je

Je

దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ, ప్రభుత్వ నిర్ణయాలను జేపీ మోర్గాన్ సీఈవో ప్రశంసించారు. అంతేకాకుండా అమెరికన్లకు సూచనలు కూడా చేశారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ అద్భుతమైన పనితీరు ప్రదర్శించారని జేపీ మోర్గాన్ చేజ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జేమీ డిమోన్ కొనియాడారు. ఎకనామిక్ క్లబ్‌ ఆఫ్ న్యూయార్క్‌ అనే సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. మోడీ పాలనలో తీసుకువచ్చిన సంస్కరణలను మెచ్చుకున్నారు. బీజేపీ ప్రభుత్వం అమలు చేసిన ఆర్థిక సంస్కరణలను ప్రశంసించారు. వాటిలో కొన్నింటిని యూఎస్‌లో కూడా ప్రవేశపెట్టవచ్చని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Sunita Williams: అంతరిక్ష యాత్రపై కీలక ప్రకటన.. ఈసారి ఎన్ని రోజులంటే..

భారత నాయకుడి ముందు ఎన్నో సవాళ్లు ఉన్నప్పటికీ.. ఆయన తన దేశాన్ని ఎలా నడిపిస్తున్నారన్నది యూఎస్ అధికారులు ఆలోచించుకోవాలన్నారు. మోడీ అద్భుతమైన పనితీరు చూపారని.. 400 మిలియన్ల మందిని పేదరికం నుంచి బయటపడేశారని గుర్తుచేశారు. వారు మనతో వ్యాపారం చేద్దామనుకున్నప్పుడు మనం వెళ్లి, ఉపన్యాసం ఇస్తామన్నారు. పనులు ఎలా చేయాలో పాఠాలు చెబుతాం కానీ.. భారత్‌లో అద్భుతమైన విద్యావ్యవస్థ, మౌలిక సదుపాయాలు ఉన్నాయని కొనియాడారు. అలాగే గతంలో వారికి ఆయా రాష్ట్రాల్లో ఉన్న పన్ను వ్యవస్థలు చాలా సంక్లిష్టంగా ఉండేవని.. అవి అవినీతికి దారితీసేవన్నారు. ఆ సంక్లిష్టతను బ్రేక్‌ చేసి.. పన్ను వ్యవస్థను సంస్కరించారన్నారు. భారత్‌లో ప్రతీ పౌరుడిని గుర్తించే ఆధార్‌వ్యవస్థ ఉందన్నారు. 700 మిలియన్ల బ్యాంకు ఖాతాలున్నాయని.. సానుకూల మార్పు దిశగా ఆయన కఠిన నిర్ణయాలు తీసుకున్నారని వెల్లడించారు. అలాంటి వైఖరిని మన నేతలు పాటించాల్సిన అవసరం కాస్త ఎక్కువగానే ఉందని అమెరికన్లను ఉద్దేశించి జేమీ డిమోన్ ప్రసంగించారు. ఆయన ప్రసంగించిన ప్రసంగాన్ని ఎక్స్‌లో కేంద్రమంత్రి పీయూస్ గోయల్ పోస్టు చేశారు.

ఇది కూడా చదవండి: Chandrashekar Rao: దద్దమ్మలకు దమ్ములేక పంటలు ఎండబెట్టారు

Exit mobile version