NTV Telugu Site icon

Jaishankar: ఇజ్రాయెల్ – హమాస్ కాల్పుల విరమణకు భారత్ అనుకూలంగా ఉంది: ఎస్ జైశంకర్

Jayashankar

Jayashankar

Jaishankar talked about Israel and Hamas issue: సౌదీ అరేబియా రాజధాని రియాద్‌ లో వ్యూహాత్మక చర్చల కోసం భారత్ – గల్ఫ్ సహకార మండలి (GCC) తొలి మంత్రివర్గ సమావేశంలో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పాలస్తీనాలోని పరిస్థితులపై మాట్లాడారు. ఎస్. జైశంకర్ గాజాలో పరిస్థితిని భారతదేశం యొక్క “అతిపెద్ద ఆందోళన” గా అభివర్ణించారు. అలాగే భారతదేశం ఇజ్రాయెల్-హమాస్ కాల్పుల విరమణకు అనుకూలంగా ఉందని తెలిపారు.

iPhone 16 Price: ఐఫోన్‌ 16 సిరీస్ ఫోన్లు విడుదల.. ధర, ఫీచర్లు ఇవే!

ఈ నేపథ్యంలో విదేశాంగ మంత్రి మాట్లాడుతూ.., గాజాలో ప్రస్తుత పరిస్థితి ఇప్పుడు మా అతిపెద్ద ఆందోళన. ఈ విషయంలో భారతదేశం వైఖరి సూత్రప్రాయంగా, స్థిరంగా ఉంది. మేము తీవ్రవాదం, బందీల సంఘటనలను ఖండిస్తున్నాము. అయినా కానీ ఈ ఘటనలలో అమాయక పౌరుల హత్యలు కొనసాగుతున్నాయి. ఇందుకు మేము చాలా బాధపడ్డాము. మరణాల ద్వారా ఏదైనా ప్రతిస్పందన మానవతా చట్టం సూత్రాలను గుర్తుంచుకోవాలి.

Land Slide: భారీగా విరిగిపడ్డ కొండచరియలు.. ముమ్మరంగా సహాయక చర్యలు..

అక్టోబరు 7న, గాజా స్ట్రిప్‌ను పాలిస్తున్న హమాస్ ఇజ్రాయెల్‌పై భూమి, గగనతలం, సముద్రం ద్వారా భయానకమైన దాడిని ప్రారంభించింది. ఇందులో 1,200 మందిని చంపి, 250 మందిని అపహరించింది. స్థానిక ఆరోగ్య అధికారుల ప్రకారం, ఇజ్రాయెల్ గాజాపై దాడి చేసింది. ఇది పెద్ద విధ్వంసం కలిగించింది. ఇందులో భాగంగా ఇప్పటివరకు సుమారు 40 వేల మందిని చంపింది. 11 నెలలుగా సాగుతున్న ఈ వివాదానికి ముగింపు పలికేందుకు ఇరుపక్షాలు ఇప్పటి వరకు కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదుర్చుకోలేకపోయాయి.

Show comments