NTV Telugu Site icon

Teacher Harassment: విద్యార్థినిపై విరుచుకపడ్డ టీచర్.. జుట్టు పట్టుకుని..?

Teacher Harassment

Teacher Harassment

Teacher Harassment: రాజస్థాన్ రాజధాని జైపూర్‌ లోని బనీ పార్క్‌లో ఉన్న మహాత్మా గాంధీ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలు ఒక విద్యార్థిని జుట్టు పట్టుకుని కిందకు తోసేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోమవారం వైరల్‌గా మారింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వెంటనే విద్యాశాఖ ఆ ఉపాధ్యాయురాలిని సస్పెండ్ చేసింది. ఈ ఘటనకు సంబంధించి ప్రిన్సిపాల్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆగస్టు 3న ఈ ఘటన జరిగింది. ఘటనలో ఆ అమ్మాయి పేరు అన్షిక. వీడియో బయటకు వచ్చిన వెంటనే విద్యాశాఖకు సమాచారం అందించారు. ఈ కేసులో రెండవ తరగతి టీచర్ బబితా చౌదరిని సస్పెండ్ చేశారు.

IND vs SL: ఓటమి నుండి టీమిండియా కోలుకుంటుందా.? ఎలాంటి మార్పులు ఉండబోతున్నాయంటే..

ఒకవైపు రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను తీసుకురావాలని విద్యాశాఖ ప్రయత్నిస్తూనే పాఠశాలల్లో ఎన్రోల్మెంట్‌ పెరిగి విద్యార్థుల డ్రాప్‌ అవుట్‌ సమస్య లేకుండా పోతుంది. అదే సమయంలో రాజధానిలోని ప్రభుత్వ పాఠశాల నుండి ఇలాంటి వీడియో రావడం కారణంగా తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలకు పంపడంలో భయపడుతున్నారు. ఈ కేసు బానీ పార్క్‌లో ఉన్న ప్రభుత్వ పాఠశాలకు సంబంధించినది. ఆగస్టు 3న కోపోద్రిక్తుడైన ఉపాధ్యాయురాలు తరగతి సమయంలో బాలిక జుట్టును పట్టుకుని నేలపై పడింది. దీంతో విద్యార్థినికి చేతికి క్రాక్ వచ్చింది.

Show comments