NTV Telugu Site icon

Life Imprisonment: అల్లుడి హత్య.. 7 ఏళ్ల తర్వాత అత్త, మామలతో సహా ఐదుగురికి జీవిత ఖైదు

Life Imprisonment

Life Imprisonment

Life Imprisonment: ఏడేళ్ల నాటి పరువు హత్య కేసులో అత్త, మామతో సహా ఐదుగురికి జైపూర్‌ లోని సబార్డినేట్ కోర్టు జీవిత ఖైదు విధించింది. ప్రేమ వివాహం చేసుకున్నారనే కోపంతో అల్లుడిని హత్య చేసినందుకు బాలిక తండ్రి జీవన్ రామ్, తల్లి భగవానీ దేవి, భగవానా రామ్, షూటర్ వినోద్, రామ్‌దేవ్‌లను దోషులుగా పరిగణిస్తూ ఈ శిక్ష విధించారు. ఈ కేసులో మరో ఇద్దరు నిందితులు నిర్దోషులుగా తేలడంతో వారిని నిర్దోషులుగా విడుదల చేశారు. జైపూర్ జిల్లా ఏరియాలోని అదనపు సెషన్స్ కోర్టు నెం. 4 ఈ శిక్షను ఖరారు చేసింది.

Read Also: Free Gas Cylinder Scheme: ఉచిత గ్యాస్‌పై కన్ఫ్యూజ్ వద్దు.. ఆ కార్డులకు ఆధార్‌ లింక్‌ ఉంటే అర్హులే..!

దోషిగా తేలిన జీవన్ రామ్ కుమార్తె 2012లో కేరళ వాసి అమిత్ నాయర్‌తో ప్రేమ వివాహం చేసుకుంది. ఆ తర్వాత కూతురు ఆస్తిపై తన హక్కులను వదులుకుంది. పెళ్లయ్యాక ఆ యువతి తన భర్తతో కలిసి కేరళ వెళ్లింది. ప్రేమ వివాహం చేసుకున్నందుకు అల్లుడిని చంపేందుకు అత్త, మామలు హంతకులకు కాంట్రాక్ట్ ఇచ్చారు. 2017లో అమిత్‌ని హత్య చేసేందుకు అమ్మాయి కుటుంబం వినోద్‌, రామ్‌దేవ్‌లకు కాంట్రాక్ట్‌ ఇచ్చింది. దాంతో వారు అవకాశం చూసి సివిల్ ఇంజనీర్ అమిత్ నాయర్ ను 4 సార్లు కాల్పులు జరపడంతో, అతను అక్కడికక్కడే మరణించాడు. ఘటన అనంతరం ముష్కరులిద్దరూ కారులో అజ్మీర్ రోడ్డుకు వెళ్లి అక్కడి నుంచి బస్సులో సూరత్ వెళ్లారు. మిగిలిన దోషులు కారులో దివానా వెళ్లారు. దీని తర్వాత పోలీసులు వినోద్‌ను అరెస్టు చేశారు. అయితే, రామ్‌దేవ్ అవకాశం చూసి పారిపోయాడు. కొన్ని రోజుల తర్వాత జోధ్‌పూర్‌లోని పిప్యాడ్ సిటీలో అతన్ని అరెస్టు చేశారు.

Read Also: SRH Retention List: అభిషేక్ శర్మకు జాక్‌పాట్.. అతడికి మాత్రం నిరాశే!