NTV Telugu Site icon

Jailer Song: జపాన్ లో కూడా ట్రెండింగ్ అవుతున్న తమన్నా సాంగ్..

Whatsapp Image 2023 08 16 At 2.16.40 Pm

Whatsapp Image 2023 08 16 At 2.16.40 Pm

రజనీకాంత్ జైలర్ మూవీ ఆగస్టు 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జైలర్ సినిమా కు నెల్సన్ దిలీప్ దర్శకత్వం వహించాడు. విడుదల అయిన మొదటి షో నుంచే అదిరిపోయే టాక్ తో దూసుకుపోతుంది. గత ఏడాది కమల్ హాసన్ విక్రమ్ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయం సాధించి అదిరిపోయే కమ్ బ్యాక్ ఇచ్చాడు.ఇప్పుడు సూపర్ స్టార్ రజిని కి కూడా జైలర్ సినిమాతో అదిరిపోయే విజయం సాధించాడు. జైలర్ సినిమా చూసి రజనీకాంత్ ఫ్యాన్స్ తలైవా ఈజ్ బ్యాక్ అంటూ కాలర్ ఎగరేస్తున్నారు. దర్శకుడు నెల్సన్ గత చిత్రం బీస్ట్ ప్లాప్ అవ్వడంతో రజనీ తో చేసే జైలర్ సినిమా మీద గట్టిగానే ఫోకస్ పెట్టి అద్భుత విజయం సాధించాడు. ఈ సినిమాలో రజనీకాంత్ తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాడు.. జైలర్ విదులైన అన్ని ఏరియాల నుంచి సూపర్ హిట్ టాక్ వస్తుంది.ఈ సినిమా మొదటి రోజే దాదాపు 90 కోట్లకు పైగా వసూల్ చేసి భారీ రికార్డు క్రియేట్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా మొదటి రోజు దాదాపు 10 కోట్ల వరకు వసూల్ చేసింది.ప్రస్తుతం ఈ మూవీ 350 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి బ్లాక్ బస్టర్ హిట్ గా దూసుకుపోతుంది..

ఇక ఈ సినిమాలో లో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ రజినీకాంత్ కు జోడీగా నటించారు. అలాగే తమన్నా కూడా ముఖ్య పాత్రలో మెరిసింది. అలాగే కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ , తెలుగు లో సునీల్ వంటి స్టార్ క్యాస్ట్ ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించారు.ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ అదిరిపోయే మ్యూజిక్ అందించాడు.ఈ సినిమాలో తమన్నా ‘నువ్ కావాలయ్యా’ అనే పాటలో అదిరిపోయే స్టెప్పులేసింది. ఈ పాట ఎంత హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ పాట విడుదలైన కొన్ని నిమిషాలకే ట్రెండింగ్ గా నిలిచింది.సోషల్ మీడియాలో ఈ పాట విపరీతంగా ట్రెండ్ అయింది.ఎంతో మంది ఈ వీడియోకు రీల్స్ చేసి తమ ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ కూడా చేస్తున్నారు. తాజాగా ఇద్దరు జపాన్ కు చెందిన యువతులు ఈ పాట హుక్ స్టెప్ ను వేసి అందరిని ఎంతగానో ఆకట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..

Show comments