NTV Telugu Site icon

Myanmar: ఉద్యోగులకు జీతం పెంచిన యజమానికి జైలు శిక్ష..కారణం ఇదే..?

Myanmar

Myanmar

మయన్మార్‌లో ఆశ్చర్యకరమైన సంఘటనలు జరుగుతున్నాయి. కొంతమంది షాపుల యజమానులు తమ ఉద్యోగులకు జీతాలు పెంచడంతో, వారిని జైలుకు పంపారు. ఉద్యోగులకు ఎక్కువ జీతాలు ఇస్తున్నారని అలాంటి వారి కోసం వెతకాలని ప్రభుత్వం ఆదేశించింది. బహుశా అక్కడ అలాంటి చట్టం ఉందా అని మీరు అనుకుంటూ ఉండవచ్చు. అక్కడ ఇలాంటి చట్టం లేదు. మయన్మార్‌లో జీతం పెంచడం చట్టవిరుద్ధం కాదు. అయితే ప్రభుత్వం ఇలా ఆందోళన చెందడానికి ఒక కారణం ఉంది. న్యూయార్క్ టైమ్స్ నివేదిక ప్రకారం.. మయన్మార్‌లోని మాండలేలో నివసించే ప్యాయ్ ఫియో జా మూడు దుకాణాల యజమాని. వారు మొబైల్ ఫోన్ వ్యాపారం చేస్తారు. ఈ సంవత్సరం అతను బాగా సంపాదించారు. కాబట్టి అతను తన ఉద్యోగుల జీతాలను పెంచారు. దీంతో ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేశారు. కానీ మయన్మార్ సైన్యానికి ఇది నచ్చలేదు. వారు వెంటనే ప్యాయ్ ఫియో జావ్‌ను అరెస్టు చేశారు. వారి దుకాణాలకు కూడా తాళాలు వేశారు. తమ ఉద్యోగుల వేతనాలు పెంచుతున్నట్లు ఆన్‌లైన్‌లో వార్తలు వ్యాపించడంతో కనీసం 10 మంది దుకాణదారులు జైలు పాలయ్యారు. ఇది మూడు సంవత్సరాల వరకు జైలు శిక్షకు దారితీయవచ్చు. జీతం పెరగడంతో చాలా సంతోషించామని, అయితే ఇప్పుడు మా షాప్ మూతపడిందని ప్యా ఫ్యో జా షాప్ ఉద్యోగి తెలిపారు.

READ MORE: Oppo Reno 12 Series: జులై 12న భారత్‌లో ఒప్పో రెనో 12 సిరీస్‌ 5జీ ఫోన్‌ లాంచ్‌ .. ఏయే ఫీచర్లు ఉండొచ్చంటే?

2021లో సైన్యం అధికారం చేపట్టినప్పటి నుంచి మయన్మార్ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఆ దేశానికి సహాయం చేయడానికి ఏ దేశం సిద్ధంగా లేదు. సైన్యంపై ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. దీంతో పరిస్థితి మరింత దారుణంగా మారింది. సాయుధ దళాలు దేశంలోని సగానికి పైగా ఆక్రమించుకున్నాయి. వారే ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. వారు అనేక సైనిక స్థావరాలు మరియు పోస్ట్‌లను స్వాధీనం చేసుకుంటున్నారు. దీని కారణంగా చైనా, భారత్, థాయ్‌లాండ్‌లతో వాణిజ్యానికి అంతరాయం ఏర్పడింది. ప్రజల చేతుల్లోకి ఎక్కువ డబ్బు వెళ్లడం వల్లనే ద్రవ్యోల్బణం పెరుగుతోందని ప్రభుత్వం భావిస్తోంది. అలా వచ్చిన డబ్బులతో వారు వసరానికి మించి వస్తువులు కొనుగోలు చేయడం ప్రారంభిస్తారని.. అప్పుడు సరుకుల కొరత ఏర్పడి ధరలు పెరుగుతున్నాయని అభిప్రాయపడింది. ప్రజల వద్ద డబ్బు లేకపోతే.. వారు తక్కువ ఖర్చు చేస్తారు. ఇది ద్రవ్యోల్బణం నియంత్రణలోకి వస్తుంది.

READ MORE:Marri Rajasekhar Reddy: మల్కాజిగిరి ఎమ్మెల్యేపై దాడికి ప్రయత్నించిన కాంగ్రెస్ నాయకులు..

ఈ కారణంగా.. జీతాల పెంపు అశాంతిని రెచ్చగొట్టడం కిందకు వస్తుందని సైన్యం భావిస్తోంది. ఈ మేరకు ప్యాయ్ ఫియో జాలోని ఒక దుకాణం వెలుపల సైన్యం నోటీసును ఉంచింది. అందులో ‘సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలగడంతో ఈ దుకాణానికి తాళం వేశారు’ అని రాసి ఉంది. ఇంతకుముందు, బియ్యం, మాంసం మరియు వంట నూనె వంటి ప్రధాన ఆహార పదార్థాలను తక్కువ కొనుగోలు చేయడానికి సైన్యం ఆదేశించింది. బంగారం కొనుగోళ్లు ఆగిపోయాయి. విదేశీ కరెన్సీ కొనుగోలుపై నిషేధం ఉంది. విదేశాలకు డబ్బు పంపడం కూడా నిషేధించబడింది. ఈ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నారు. బంగారం, విదేశీ కరెన్సీ, విదేశీ స్థిరాస్తులు విక్రయిస్తున్న 35 మందిని అరెస్టు చేశారు. కేవలం రెట్టింపు ధరకు బియ్యాన్ని విక్రయించినందుకు ఏడుగురు ప్రధాన బియ్యం ఉత్పత్తిదారుల అధినేతలతో సహా 11 మందిని అరెస్టు చేశారు.