Site icon NTV Telugu

Jai Hanuman : అంజనాద్రి సాక్షిగా ‘జై హనుమాన్’ షురూ.. హనుమంతుడిగా రిషబ్ శెట్టి ఎంట్రీ..!

Jai Hanuman Movie Launch,

Jai Hanuman Movie Launch,

టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ రూపొందించిన ‘హనుమాన్’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ చిత్రానికి సీక్వెల్‌గా రాబోతున్న ‘జై హనుమాన్’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నేడు (ఫిబ్రవరి 22) ఈ చిత్రానికి సంబంధించిన గ్రాండ్ పూజా కార్యక్రమం కర్ణాటకలోని హంపి సమీపంలో ఉన్న అంజనాద్రి బెట్టలో ఘనంగా జరిగింది.

Also Read : Kalki 2 : ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్..‘కల్కి 2’ షూటింగ్ షురూ!

ఈ పూజా కార్యక్రమంలో దర్శకుడు ప్రశాంత్ వర్మతో పాటు, ‘కాంతార’ ఫేమ్ రిషబ్ శెట్టి, యువ నటుడు తేజ సజ్జా ఇతర చిత్ర బృందం పాల్గొన్నారు. ఈ సీక్వెల్‌లో హనుమంతుడి పాత్రలో రిషబ్ శెట్టి నటించబోతున్నట్లు ఇప్పటికే వార్తలు రాగా, నేడు ఆయన స్వయంగా పూజలో పాల్గొనడంతో ఆ వార్తలు నిజమయ్యాయి. మొదటి భాగంలో హీరోగా నటించిన తేజ సజ్జా కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్నారు. అంజనాద్రి బెట్టను హనుమంతుడి జన్మస్థలంగా భావిస్తారు, అందుకే అక్కడే ఈ సినిమాను ప్రారంభించడం విశేషం. ఈ సీక్వెల్‌లో గ్రాఫిక్స్, కథాంశం మొదటి భాగం కంటే పదిరెట్లు భారీగా ఉండబోతున్నాయని ప్రశాంత్ వర్మ ఇప్పటికే హింట్ ఇచ్చారు. హనుమంతుడు శ్రీరాముడికి ఇచ్చిన మాటను ఎలా నిలబెట్టుకున్నాడు అనే పాయింట్‌తో ఈ సినిమా సాగనుందని సమాచారం.

Exit mobile version