NTV Telugu Site icon

Jahnvi Kapoor : ఎన్టీఆర్‌తో నటించే ఛాన్స్ వస్తే మాత్రం వదులుకోను

Jahnvi Kapoor

Jahnvi Kapoor

జాన్వీ కపూర్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. శ్రీదేవి కూతురుగా అందరికీ పరిచయే అయినా.. బాలీవుడ్‌లో జాన్వీ చేసిన కొన్ని సినిమాలే. అయితే.. బీటౌన్‌లో ఈ సినిమాలు కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. కానీ.. ఎప్పుడూ సోషల్‌మీడియాలో ఉండే జాన్వీ తన అభిమానులకు దగ్గరగా ఉంటుంది. శ్రీదేవి తెలుగులో ఒక వెలుగు వెలిగిన తార. ఆమె కూతురు జాన్వీ కపూర్‌ను సైతం తెలుగులో తెరంగేట్రం చేయించాలని ఇప్పటికే చాలా మంది దర్శకులు కథలు వినపించారు. కానీ.. ఎవరి కథలు జాన్వీకి కనెక్ట్‌ కాకపోవడతో నో చెప్పింది.
Also Read : ఇలాగే వివాహేతర సంబంధాలు మొదలవుతున్నాయ్.. షాకింగ్‌ నిజాలివే..

సౌత్ సినిమాలు చేయడానికి జాన్వీ ఆసక్తిని చూపిస్తోందని ఇటీవల బోనీ కపూర్‌ వెల్లడించారు. తాజాగా ఇదే విషయాన్ని జాన్వీ కూడా కన్ఫర్మ్‌ చేస్తూ.. సౌత్‌ సినిమాలను సైతం ఎంతో ఇష్టంగా చూస్తానని.. ఈ మధ్య రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాను చూశానని వివరిస్తూ.. అందులో రామ్‌గా రామ్‌ చరణ్‌, భీమ్‌ గా ఎన్టీఆర్‌లు నటన ఎంతో బాగుందని తెలిపింది. తెలుగు చిత్ర పరిశ్రమలో రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌, ప్రభాస్‌, అల్లు అర్జున్‌ ఇలా అందరి యాక్టింగ్‌ నచ్చుతుందని, అయితే.. ఎన్టీఆర్‌తో నటించే అవకాశం వస్తే మాత్రం వదులుకోనని వెల్లడించింది ఈ ముద్దుగుమ్మ. చూడాలి మరీ ఎన్టీఆర్‌ సరసన నటించి అవకాశం ఏ సినిమాలో జాన్వీని వరిస్తుందోనని.

Show comments