ఈ రోజుల్లో మానవ సంబంధాలకు విలువ ఇచ్చేవారు తగ్గిపోతున్నారు. కారణాలు ఏవైనా వివాహేతర సంబంధాలు ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి.
భార్యాభర్తలు లేదా స్త్రీపురుషుల మధ్య సంతృప్తికరమైన శృంగార సుఖం లేకపోవడం ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. శృంగారం విషయంలో సంతృప్తిని ఇవ్వలేకపోతే, వారితో సంబంధాలు అనవసరమని భావిస్తారట.
దంపతుల నుంచి ప్రేమ, ఆప్యాయత లభించనివారు.. వాటిని వివాహేతర సంబంధం ఏర్పరచుకున్న వారి నుంచి ఆశిస్తారట.
కొంతమంది స్త్రీలకు, వివాహేతర సంబంధం హింసాత్మక వివాహం నుండి బయటపడటానికి ఏకైక మార్గం. గృహ హింస, మద్యపాన భాగస్వామి, వైవాహిక అత్యాచారం అన్నీ ఆమెపై ప్రభావం చూపుతాయి. ఓదార్పు కోసం ఇతరులతో సంబంధాన్ని కోరుకుంటారట.
కొన్నిసార్లు ఇద్దరు మాజీ ప్రేమికులు కలుసుకున్నప్పుడు ఒక రకమైన స్పార్క్ మళ్లీ వెలుగులోకి వస్తుంది. ఇది ఎఫైర్ వికసించటానికి కారణం కావచ్చట.
పెళ్లికి ముందు తన మనస్సులో ఉండే శృంగార కోర్కెలను పెళ్లి అయిన తర్వాత పూర్తిగా విస్మరించడం మరో కారణమట.
కొంతమంది స్త్రీలు మోసం చేసిన భాగస్వామిపై ప్రతీకారం తీర్చుకోవడం కోసం వివాహేతర సంబంధంలోకి ప్రవేశిస్తారట.
ఉద్యోగాలకు వెళ్లే మహిళలు తమ కార్యాలయాల్లో పనిచేసే సమయంలో ఇతర మహిళలకు పరాయి పురుషులతో వివాహేతర సంబంధాలు ఉన్నట్టు తెలుసుకోవడం, అదేవిధంగా తాము కూడా సంబంధం పెట్టుకోవాలని భావించడం. పురుషులు కూడా ఇలాగే ఆసక్తి చూపుతున్నారట.
దాంపత్య జీవితంలో ప్రతి రోజూ కొత్తదనం కోరుకునే మహిళలు ఈ తరహా సంబంధాల పట్ల అధిక ఆసక్తి చూపుతున్నారని తెలుస్తోంది.
తన భర్త లేదా భార్య తమతో అన్యోన్యంగా, ప్రేమగా మాట్లాడకపోవడం, నడుచుకోకపోవడం కూడా పక్క చూపులు చూస్తున్నారని పలు సర్వేల్లో తేలినట్లు వెల్లడైంది.
సాధారణంగా కొన్ని వివాహాల్లో దంపతుల మధ్య వయస్సు వ్యత్యాసం కూడా ఈ తరహా సంబంధాలకు కారణమవుతోందట.