NTV Telugu Site icon

Jackpot : జగిత్యాల యువకుడికి 30 కోట్ల జాక్‌పాట్‌..

Ajay

Ajay

అదృష్టం ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుందో తెలియదు. అయితే.. దుబాయ్‌లోని ఓ సంస్థలో డ్రైవర్‌గా పనిచేస్తున్న వ్యక్తికి లక్కీడ్రాలో రూ.30 కోట్ల లాటరీ తగిలింది. బ్రతుకు దెరువుకోసం దుబాయికి వెళ్లిన తెలుగు కుర్రాడికి జాక్ పాట్ తగలడంతో.. రాత్రికి రాత్రే ఆ యువకుడు కోటీశ్వరుడయ్యాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 30 కోట్ల రూపాయల భారీ లాటరీని దక్కించుకున్నాడు ఆ యువకుడు. జగిత్యాల జిల్లా బీర్పూర్‌ మండలంలోని టుంగూర్‌కు చెందిన ఓబుల అజయ్‌.. నాలుగేళ్ల క్రితం దుబాయ్‌ వెళ్లాడు.

Also Read : One Rank One Pension: వన్ ర్యాంక్ వన్ పెన్షన్ స్కీమ్ ని సవరించిన కేంద్రం.. 25 లక్షల మందికి లబ్ధి.
అక్కడి ఓ కంపెనీలో డ్రైవర్‌గా పనిచేస్తున్న అజయ్‌ అధికారికంగా నిర్వహిస్తున్న ఎమిరేట్స్‌ లక్కీడ్రాలో 30 దిర్హమ్స్‌ రెండు ల్యాటరీ టికెట్లు కొన్నాడు. ఇందులో ఓ టికెట్‌లో 1.50 కోట్ల దిర్హమ్స్‌ గెలుచుకున్నాడు. దీని విలువ భారతీయ కరెన్సీలో సుమారు రూ.30 కోట్లు. ఈ మేరకు ఆ లాటరీని నిర్వాహకులు అజయ్ కు అందించారు. భారీ లాటరీ సొంతం చేసుకోవడంతో అజయ్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. వీటిలో కొంత కుటుంబానికి వెచ్చించి, మిగతా డబ్బుతో భారత్‌లో ఉంటూ వ్యాపారం చేస్తానని అజయ్‌ తెలిపారు.
Also Read : Uttam Kumar Reddy : నాలుగేళ్లలో ఎయిమ్స్ బీబీనగర్ ఏర్పాటులో ఎలాంటి పురోగతి లేదు

Show comments