Congress Leader’s Mother Brutally Murdered in Jagtial: జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో దారుణం చోటుచేసుకుంది. నాచుపల్లి గ్రామంలో ఓ మహిళను దుండగులు అతికిరాతకంగా బండరాయితో తలపై మోది హత్య చేశారు. అక్కడితో ఆగకుండా శవాన్ని ఈడ్చుకెళ్లి పక్కనే ఉన్న బావిలో పడేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ దారుణ ఘటన కొడిమ్యాల మండలంలో కలకలం రేపుతోంది.
Also Read: CPI Narayana: రజనీకాంత్ మేకప్ లేకుండా ఎలా ఉంటారు?.. సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు!
చనిపోయిన మహిళ కాంగ్రెస్ నాయకుడు, కొడిమ్యాల మండల ప్యాక్స్ చైర్మన్ మేన్నేని రాజనర్సింగ రావు తల్లి ప్రేమలతగా పోలీసులు గుర్తించారు. నిందితుడు సురభి రఘునందన్ రావు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. రఘునందన్ నాచుపల్లి గ్రామంకు చెందిన వాడే. మృతురాలు ప్రేమలత తనను చంపడానికి వస్తున్నారని అదే గ్రామానికి చెందిన ఓ వ్యకికి ఫోన్ చేసి చెప్పింది. డీఎస్పీ రఘు చందర్, సీఐ నీలం రవి ఘటన స్థలాన్ని పరిశీలించారు. హత్యకు గల కారణాలపై స్థానికులు పోలీసులను ఆరా తీస్తున్నారు. ఈ హత్యపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.