Site icon NTV Telugu

Jagtial: తల్లిదండ్రులు తరచూ గొడవ పడుతున్నారని.. కుమారుడు సూసైడ్..

Bride Suicide

Bride Suicide

Jagtial: తల్లిదండ్రులు బైక్ కొనివ్వలేదనో, లేక ఫోన్ కొనివ్వలేదో ఆత్మహత్య చేసుకున్న పిల్లల్ని చూశాం.. గేమ్స్ ఆడొద్దని కట్టడి చేసిన పిల్లలు సైతం బలవన్మరణానికి పాల్పడటం చూశాం. కానీ ఇక్కడ మాత్రం ఓ పిల్లాడు మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ మనోవేదన ఎవ్వరి వల్లో రాలేదు.. కన్న తల్లిదండ్రుల వల్లే వచ్చింది. తల్లిదండ్రులు తరచుగా గొడవ పడుతున్నారని మనస్థాపం చెందిన కుమారుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో జరిగింది.

READ MORE: Election Rigging: బీహార్‌ ఎన్నికల్లో రిగ్గింగ్‌ జరిగింది.. ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు..!

పట్టణంలోని రథాల పంపు ఏరియాలో రవీందర్ – అపర్ణ దంపతులు అద్దెకు ఉంటున్నారు. వీరి కుమారుడు విరాట్ (13) పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. తండ్రి హైదరాబాద్‌లో ఫిజియోథెరపిస్టుగా పనిచేస్తుండగా తల్లి గృహిణి. ఈ దంపతుల మధ్య ఇటీవల తరచుగా గొడవలు జరుగుతుండేవి. దీంతో కొడుకు మనోవేదనకు గురైనట్లు తెలుస్తోంది. ఎప్పటిలాగే శనివారం రాత్రి తల్లిదండ్రుల మధ్య గొడవ జరుగుతుండడంతో ఇంట్లో ఉన్న కొడుకు మనస్థాపానికి గురై ఇంట్లోని బెడ్ రూమ్‌లోకి వెళ్లాడు. తలుపు మూసి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన తల్లిదండ్రులు తలుపు తీయాలని ఎంత కోరిన తీయకపోవడంతో చుట్టుపక్కల వారి సహాయంతో తలుపులు బద్దలు గొట్టారు. అప్పటికే విరాట్ ఉరేసుకుని వేలాడుతూ కనిపించాడు. వెంటనే బాలుడిని అంబులెన్స్ సహాయంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై పోలీసుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

READ MORE: తీరు మార్చుకోని movierulz.. మొన్న రిలీజ్ అయిన సినిమాలు వెబ్‌సైట్‌లో ప్రత్యక్షం..!

Exit mobile version