NTV Telugu Site icon

Jaggareddy: సిరిసిల్ల..సిద్ధిపేటకు నేనొస్తా.. కావాలంటే మంత్రులను తీసుకొస్తా..జగ్గారెడ్డి సవాల్

Jaggareddy

Jaggareddy

సీఎం రేవంత్ రెడ్డి రూ. రెండు లక్షల రుణమాఫీ చేయగానే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఇబ్బంది పడుతున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డిని శబాష్ అని మెచ్చుకోలేక టెన్షన్ లో వాళ్ళు ఉన్నారన్నారు. పదేండ్లలో ఒకే కిస్తీలో మనం ఎందుకు చేయలేక పోయామని నిద్ర లేక మైండ్ బ్లాక్ అయి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
“కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆగస్ట్15 లోపు రెండు లక్షల ఋణమాపి చేస్తామన్నారు. మొదటి దఫా అందరి అకౌంట్లో టింగ్ టింగ్ మని డబ్బులు పడ్డాయి. ముఖ్యమంత్రి స్థాయికి తగ్గట్లు కేసీఆర్ కామెంట్ చేస్తే బాగుంటది. కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్, నేను వర్కింగ్ ప్రెసిడెంట్.. మీ సవాల్ ను స్వీకరిస్తున్నా.. సిరిసిల్ల, సిద్ధిపేట కు నేను వస్తా. నేను నీ స్థాయికి సరిపోనంటే మంత్రి శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ని రిక్విస్ట్ చేసి సిరిసిల్ల తీసుకొస్తా..తర్వాత కొడంగల్ పోదాం. రూ. రెండు లక్షల పైన అప్పు ఉన్నవాళ్లు అప్లికేషన్ పెట్టు కుంటే వాళ్ళ రెండు లక్షల అప్పు మాపి అవుతుంది.
టెక్నికల్ ప్రాబ్లమ్ తో కొందరి అకౌంట్లో అమౌంట్ పడలేదు. గవర్నమెంట్ పరంగా ప్రాబ్లమ్ క్లియర్ చేస్తుంది.” అని వ్యాఖ్యానించారు.

READ MORE: Kolkata doctor case: కోల్‌కతాలో ట్రాన్స్ జెండర్స్ భారీ నిరసన.. న్యాయం చేయాలని డిమాండ్

వర్జినల్ రైతులు ఎవరు ప్రాబ్లమ్ క్రియేట్ చేయట్లేదని.. కేటీఆర్, హరీష్ రావుల జెండాలు మోసే వ్యక్తులు ప్రాబ్లమ్ క్రెయేట్ చేస్తున్నారని జగ్గారెడ్డి అన్నారు. ” కేటీఆర్, హరీష్ బతుకు దారం తెగిన గాలి పటం లాగా తయారైంది. ఇప్పటి వరకు రూ. 2కోట్ల మంది మహిళలు బస్ లో ప్రయాణం చేసిండ్రు. నెరలేళ్ల లో దళితులను కొట్టిన మీ ప్రవర్తన ఏమైంది. ప్రజల కోసం కాంగ్రెస్ కార్యకర్తలు ధర్నాలు చేస్తుంటే లాఠీలు విగేటట్లు మీరు కొట్టింది నిజం కాదా హరీష్ రావు. దానికి నేను ప్రత్యక్ష సాక్ష్యం. సిద్ధిపేట పోలీస్ స్టేషన్లో సమస్యలు చెప్పుకోవడానికి వెళితే పట్టించుకోలేని నాధుడే లేడు. మల్లన్న సాగర్ విషయంలో నర్సారెడ్డి ని కట్టెలు విరిగెటట్లు కొట్టలేదా. కోదండరాంను ఇబ్బంది పెట్టింది నిజం కాదా. హరీష్ రావు చెప్తే సురేందర్ రెడ్డి బలుపెక్కి దౌర్జన్యం చేసిండు. ధర్నా అనే పదాన్ని పదేండ్లు దిగదార్చారు. వాళ్ళు చేసింది ఎక్కువ.. మేము చేసింది తక్కువ.. ఏడు ఏండ్లు ఇందిరా పార్కు దగ్గర గొంతు విప్పకుండా చేయలేదా. గొంతు విప్పి రైతులు, నిరుద్యోగులు, మహిళ లు మాట్లాడలేని పరిస్థితి” అని జగ్గారెడ్డి మాట్లాడారు.