Jaggareddy: ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి విడిగా భేటీ అయ్యారు. ఈ భేటీలో ఏఐసిసి సంస్ధాగత వ్యవహారాల ఇంచార్జ్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ పాల్గొన్నారు. ఛత్తీస్ ఘడ్ వ్యవహారాల పై సమీక్ష సమావేశం ముగియగానే రాహుల్ గాంధీతో జగ్గారెడ్డి భేటీ అయ్యారు. దాదాపు 15 నిమిషాల పాటు వీరి భేటీ కొనసాగింది. అయితే ఈ భేటీ పట్ల జగ్గారెడ్డి సంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. భేటీకీ గల కారణాలపై మీడియాతో మాట్లాడకుండానే ఢిల్లీ నుంచి జగ్గారెడ్డి బయల్దేరారు.
Read Also: Renu Desai: రేణు పోస్ట్ పై పవన్ ఫ్యాన్స్ రియాక్షన్..
అయితే రాహుల్ గాంధీతో జగ్గారెడ్డి భేటీలో తెలంగాణ కాంగ్రెస్ లో అంతఃకలహాలను వివరించినట్లు సమాచారం తెలుస్తోంది. సోషల్ మీడియా ద్వారా పార్టీలో ఆధిపత్యం కోసం ప్రత్యర్ధులపై జరుగుతున్న వ్యతిరేక ప్రచారాన్ని జగ్గారెడ్డి రాహుల్ గాంధీకి వివరించినట్లు
సమాచారం. అయితే రాహుల్ గాంధీ మాత్రం సమిష్టిగా వచ్చే ఎన్నికల్లో పోరాడాలని జగ్గారెడ్డికి సూచించినట్లు సమాచారం.
Read Also: T.G. Viswa Prasad: పవన్ నిర్మాత ఇంట తీవ్ర విషాదం..
మరోవైపు ఈరోజు ఖమ్మంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క కలిసి సమావేశం నిర్వహించారు. వచ్చే నెలలో ఖమ్మం రాహుల్ గాంధీ సభపై చర్చించారు. ఈ సభలోనే రాహుల్ గాంధీ సమక్షంలో పొంగులేటి పార్టీలో చేరునున్నారు. తెలంగాణలో ఇప్పుడిప్పుడే కాంగ్రెస్ రాజకీయాలు బలంగా నడుస్తున్నాయన్న టాక్ వినపడుతుండగా.. జగ్గారెడ్డి అంత:కలాహాలపై పార్టీలో మళ్లీ ప్రకంపనలు రేపినట్లైంది.