జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ తేదీ దగ్గరపడుతోంది. ఈ నేపథ్యంలో అధికార ప్రతిపక్ష పార్టీలు గెలుపు కోసం వ్యూహాలు రచిస్తున్నాయి. తమ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. ఈ క్రమంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కేటీఆర్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ మాటలు నమ్మొద్దని జూబ్లీహిల్స్ ఓటర్లకు సూచించారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. మళ్ళీ ఐదేళ్లు మేమే అధికారంలో ఉంటామని తెలిపారు. జూబ్లిహిల్స్ ఓటర్లు… నవీన్ యాదవ్ యువకుడికి ఓటేయాలని కోరుతున్నానని అన్నారు. నవీన్ యాదవ్ పట్టువిడవకుండా రాజకీయ పోరాటం చేస్తున్నాడు అని తెలిపారు.
Also Read:Anchor Suma : మేం విడిపోవాలని కోరుకున్నారు.. రాజీవ్ తో బంధంపై సుమ కామెంట్స్
మూడేళ్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. కాంగ్రెస్ ను గెలిపిస్తే మూడేళ్లు జూబ్లీహిల్స్ అభివృద్ధి జరుగుతుందన్నారు. జూబ్లీహిల్స్ ఓటర్లు కాంగ్రెస్ ని గెలిపిస్తారని మాకు నమ్మకం ఉందన్నారు. బిజెపి టీఆర్ఎస్ అభ్యర్థుల కంటే నవీన్ యాదవ్ వంద రెట్లు బెటర్ అన్నారు. నవీన్ యాదవ్ గెలిస్తే రోజు సీఎం వెంట తిరిగి పనులు చేయిస్తారు. ప్రతిపక్షానికి అవకాశం ఇస్తే.. జూబ్లీహిల్స్ కి ఏం పని చేయలేరు. సీఎం రేవంత్ రెడ్డి మాట గౌరవిస్తే.. మరింత ఉత్సాహంతో పనిచేస్తారు. అధికార పార్టీని గెలిపిస్తే ఇంటివాన్ని గెలిపించినట్టు.. ప్రతి పక్ష పార్టీని గెలిపిస్తే పాలొన్ని గెలిపించినట్టు అని తెలిపారు.
ఇంటిమనిషి ఉంటే బెడ్ రూమ్ దాకా కూడా వెళ్లి పనిచేసుకోవచ్చన్నారు. జూబ్లీహిల్స్ ఓటర్లు ప్రశాంతంగా ఆలోచించి ఓటేయాలని సూచించారు. మా మంత్రులంతా జవాబుదారీగా పనిచేస్తారు. కొల్లూరులో డబుల్ బెడ్ రూమ్ లలో నివసించే వాళ్లకు రేషన్ షాప్ లు లేవు.. కానీ సీఎం రేవంత్ రెడ్డి చెప్పగానే రేషన్ షాపులు ఏర్పాటు అయ్యాయని తెలిపారు. నవీన్ యాదవ్ ను గెలిపించి అభివృద్ధి చేసుకోండని కోరారు.
Also Read:Motorola Edge 50 pro: మోటరోలా ఫోన్ పై క్రేజీ డీల్.. రూ.36 వేల ఫోన్ రూ.23 వేలకే.. కర్వ్డ్ డిస్ప్లేతో
కేటీఆర్… అభ్యర్ధి గెలిస్తే ధర్నాలు చేసుకుంటారు. అధికార పార్టీ MLA గెలిస్తే..అభివృద్ధి జరుగుతుందన్నారు. పార్క్ లో వాకింగ్ చేసే వాళ్ళు.. ఇంట్లో పని చేసుకునే వాళ్ళకు… సినీ కార్మికులకు మాట ఇచ్చాడు. అందరికీ జవాబుదారీగా ఉంటామని తెలిపారు. కేటీఆర్ మాటలు నమ్మకండి అని జగ్గారెడ్డి తెలిపారు. కేసీఆర్ వారసత్వం పొందటానికి చూస్తున్నారని విమర్శించారు. ఆయన అవసరాల కోసం కాదు.. ప్రజలు మీ అవసరాల కోసం చూడండి.. జూబ్లిహిల్స్ లో ఎప్పుడైనా.. ఎక్కడైనా హైడ్రా ఇండ్లు కూలగొట్టిందా అని జగ్గారెడ్డి ప్రశ్నించారు.
