కేసీ వేణుగోపాల్ అందరూ కలిసి పని చేసుకోండి అన్నారని తెలిపారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. పంచాయతీ పక్కన పెట్టి ఎన్నికలకు సిద్ధం కావాలని చెప్పారని, అధికారంలోకి వస్తున్నాం అని చెప్పారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనే.. అహ్మద్ పటేల్ మంత్రి పదవికి కి సిఫారసు చేశారని, నాకు మంత్రి పదవి సోకు లేదని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణలో మంత్రి పదవి ఆశ లేదని, నాకు మంత్రి పదవుల మీద ఆశలు ఉండవని ఆయన అన్నారు.
Also Read : CM KCR : జయశంకర్ సార్ తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్మరణీయులు
ఫాలోఅప్ చేయడంలో.. వైఎస్ గ్రేట్ అని, సీఎం అవ్వడానికి ఎంత కష్ట పడ్డారో.. అయ్యాకా కూడా అంతే కష్ట పడ్డారన్నారు. ఒక పని చెప్తే.. అయ్యే వరకు ఫాలోఅప్ చేస్తారని, వైఎస్ ఆదేశంతో ఒకసారి మాత్రమే ఫ్లైట్ ఎక్కా అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ లో దురదృష్టవశాత్తు అలాంటి నేతలు లేరని, రెండేళ్లలో అలాంటి నేతలు లేకపోవడం బ్యాడ్ లక్ అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తెల్లవారుజామున కూడా మీటింగ్ లు జరిగేవని, తాను పక్కనే ఉండి అన్ని చూసుకునే వాడినని చెప్పారు.
Also Read : Gaddar Passes Away: ప్రజా గాయకుడు గద్దర్ జీవిత విశేషాలు.. మూగబోయిన ఉద్యమ గళం
