Site icon NTV Telugu

Jyothula Chantibabu: వైసీపీకి మరో షాక్‌.. టీడీపీలో చేరనున్న జగ్గంపేట ఎమ్మెల్యే..!

Jyothula Chantibabu

Jyothula Chantibabu

Jyothula Chantibabu: ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో సీట్ల మార్పు వ్యవహారం రచ్చగా మారుతోంది.. వచ్చే ఎన్నికల్లో సీట్లు రావని తెలిసిన నేతలు.. పక్క చూపులు చూస్తున్నారు.. తెలుగుదేశం పార్టీ నేతలతో టచ్‌లోకి వెళ్లే.. సీటుపై ఓ మాట తీసుకుని.. సమయం చూసి జంప్‌ అవుతున్నారు.. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధం అవుతున్నారు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు.. ఇప్పటికే టీడీపీ పెద్దలతో చర్చలు పూర్తి అయినట్టు ప్రచారం సాగుతోంది.. 2009, 2014 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరుపున జగ్గంపేట నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు చంటిబాబు.. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏలేరు ప్రాజెక్ట్ చైర్మన్ గా చంటిబాబును నియమించారు..

Read Also: Guntur Kaaram : క్రిస్మస్ పోస్టర్ రిలీజ్ చేసిన మేకర్స్.. మహేష్ కూల్ లుక్ అదిరిందిగా..

ఇక, జ్యోతుల నెహ్రూ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి టీడీపీలోకి రావడంతో.. తెలుగుదేశం పార్టీకి గుడ్‌బై చెప్పారు చంటిబాబు.. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి జగ్గంపేట స్థానంలో పోటీ చేసిన ఆయన విజయం సాధించారు. అయితే, వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి ఎవరి సీటు గ్యారంటీ లేదు అనే చర్చ సాగుతోంది.. అంతేకాదు.. జగ్గంపేట వైసీపీ టికెట్ జ్యోతుల చంటిబాబుకు ఇచ్చే పరిస్థితి లేదని క్లారిటీ కూడా వచ్చిందంట.. దీంతో.. మళ్లీ తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రెడీ అవుతున్నారట.. అయితే, జ్యోతుల నెహ్రూ, జ్యోతుల చంటిబాబు సమీప బంధువులు.. ఎమ్మెల్యేగా ఉంటే తానుండాలి, లేదంటే తన కుటుంబానికి చెందిన వారు ఉండాలి.. కానీ, బయటి వారికి ఎలా మద్దతిస్తామని అనుచరులతో చంటిబాబు వ్యాఖ్యానించినట్టు ప్రచారం సాగుతోంది.. జగ్గంపేట అసెంబ్లీ టికెట్ ఇవ్వలేమని టీడీపీ తేల్చిచెప్పినప్పటికీ.. ప్రత్యామ్నాయంగా వేరే చోట నుంచి పోటీ చేసే అవకాశం ఇవ్వాలని చంటిబాబు కోరుతున్నారట.. ఉన్న అవకాశాలను బట్టి పరిశీలిస్తామని టీడీపీ అధిష్టానం చెప్పినట్టు తెలుస్తోంది.. దీంతో.. వచ్చే ఏడాది.. అంటే జనవరి 5 లేదా 6 తేదీల్లో జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు పసుపు పార్టీ కండువా కప్పుకునే అవకాశం ఉందని చెబుతున్నారు ఆయన అనుచరులు.

Read Also: Atal Bihari Vajpayee: వాజ్‌పేయి జయంతి సందర్భంగా నివాళులర్పించిన ప్రధాని మోడీ.. పలువురు ప్రముఖులు..

కాగా, కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గానికి చెందిన జ్యోతుల చంటిబాబు ఆ మధ్య సంచలన వ్యాఖ్యలు చేశారు.. ‘పార్టీలు, గాడిద గుడ్డు.. ఇవాళ ఉంటాయి, రేపు పోతాయి.. మేం ఏమైనా ఈ పార్టీ లో శాశ్వతమా? అంటూ ఆయన హాట్‌ కామెంట్లు చేశారు.. ఏ పార్టీలో ఎవరు శాశ్వతం.. ఇప్పుడున్న వారు రేపు ఇంకో పార్టీలో ఉంటారేమో..? రేపు ఏ పార్టీ నుంచి ఎవరు పోటీ చేస్తారో..? ఎవరికి తెలుసు..? అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు అప్పట్లో పెద్ద చర్చగా మారిన విషయం విదితమే.

Exit mobile version