Jagga Reddy: నెలలో 20 రోజులు, విదేశాల్లో కేటీఆర్ ఏం చేస్తున్నాడు.. జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు!
- కేటీఆర్ ఈ మధ్య తెలంగాణలో ఉండటం లేదు
- విదేశాల్లో కేటీఆర్ ఏం చేస్తున్నాడు
- నెలలో 20 రోజులు విదేశాల్లో కేటీఆర్‌కి ఏం పని
- కేసీఆర్ కోటాలో కేటీఆర్ డైరెక్ట్ ఎమ్మెల్యే అయిపోయాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌పై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ విదేశాల్లో చల్లదనం కోసం పోతున్నారు అని అన్నారు. నెలలో 20 రోజులు విదేశాల్లో కేటీఆర్‌కి ఏం పని అని ప్రశ్నించారు. కేసీఆర్ కోటాలో కేటీఆర్ డైరెక్ట్ ఎమ్మెల్యే అయిపోయాడు అని, రాజకీయ ఒడిదుడుకులు ఆయనకేం తెలుసు? అని మండిపడ్డారు. తాము ఎన్నో వ్యవప్రయాసలతో రాజకీయ నేతలం అయ్యాం అని చెప్పారు. తమకున్న అనుభవాల ముందు కేటీఆర్ జీరో అని జగ్గారెడ్డి విమర్శించారు.
గాంధీ భవన్‌లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. ‘కేటీఆర్ ఈ మధ్య తెలంగాణలో ఉండటం లేదు. నెలకోసారి విదేశాలకు వెళుతున్నాడు. నెలలో పది రోజులు ఇక్కడ, 20 రోజులు విదేశాల్లో ఉంటాడు. కాబట్టి సీఎం రేవంత్ రెడీ షెడ్యూల్ ఆయనకు తెలియదు. విదేశాల్లో తిరిగే కేటీఆర్‌కి సీఎం రేవంత్ ఏం చేస్తున్నది ఎందుకు తెలుస్తుంది. పదేళ్లు మంత్రిగా నువ్వు, సీఎంగా మీ నాయన చేశాడు. ఢిల్లీకి ఎందుకు పోతారో ఆ మాత్రం తెలియదా? కేటీఆర్. ఎరువులు, నిధులు, నీళ్ల పంచాయతీ కోసం సీఎం రేవంత్ ఢిల్లీ వెళ్లారు. కేసీఆర్ కుటుంబం ఢిల్లీకి లిక్కర్ దందా కోసం పోయింది. హరీష్ రావు, కేటీఆర్‌లు ఈడీ ఆఫీస్ల కోసం డిల్లీ వెళ్ళారు. మా సీఎం కేంద్రం చుట్టు తిరుగుతున్నారు. కేటీఆర్‌కి సిస్టర్ స్ట్రోక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీకి పుట్టినిల్లు డిల్లీ. మీ లాగా మాది గల్లి పార్టీ కాదు కదా?. కేటీఆర్.. నీ స్ట్రోక్‌ల లొల్లి మాకెందుకు రుద్దుతున్నావు’ అని అడిగారు.
Also Read
- Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
- Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
- Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
- Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
Also Read: Hyderabad Bomb Threat: హైదరాబాద్‌లో ముగిసిన తనిఖీలు.. ఊపిరి పీల్చుకున్న పోలీసులు!
‘కేసీఆర్ కోటాలో కేటీఆర్ డైరెక్ట్ ఎమ్మెల్యే అయిపోయాడు. రాజకీయ ఒడిదుడుకులు నీకేం తెలుసు?. సన్నాసులు అనే మాటలు స్టార్ట్ చేసింది మీ అయ్యనే. మీరు తిట్టిన మాటలను కాస్త పాలిష్ చేసి తిడుతున్నారు. మేము సత్రం నడపడం లేదు, మీరు తిడితే మేము తిడతం. సీఎం రేవంత్ రెడ్డిని గోకుడు ఎందుకు, తన్నించుకోవడం ఎందుకు?. తిట్ల పురాణం మీదే.. మీరు ఒకటి అంటే మేం పది తిడుతున్నాం. కేటీఆర్ అమెరికాలో చదివి.. పదేళ్లు మంత్రిగా చేసాడు. చర్చ అసెంబ్లీలో చేయాలా?, కల్లు కాంపౌండ్‌లోనా?. కళ్లు కాంపౌండ్‌కు రా అంటే ఎట్లా?. వెయ్యి కోట్లు పక్క రాష్ట్రాల ఎన్నికల్లో పంపింది కేసీఆర్ కుటుంబం. కేటీఆర్ అబద్దాల కోరు. అందరికీ వడదెబ్బ తగిలితే.. ఆయనకు ఫ్యామిలీ దెబ్బలు తగులుతున్నాయి. కేటీఆర్‌కి అవగాహనలేక ఇబ్బందిపడుతున్నారు. కేటీఆర్ విదేశాల్లో చల్లదనం కోసం పోతున్నారు. నెలలో 20 రోజుల్లో విదేశాల్లో కేటీఆర్‌కి ఏం పని’ అని జగ్గారెడ్డి ప్రశ్నించారు.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!