NTV Telugu Site icon

Jagga Reddy : రెచ్చగొట్టడం కాదు.. ఉద్యోగాల కల్పనపై దృష్టి పెట్టండి

Jagga Reddy

Jagga Reddy

ఐటీఐఆర్ కాంగ్రెస్ యూపీఏ ప్రభుత్వం మంజూరు చేసింది.. మోడీ సర్కారు రద్దు చేసిందన్నారు కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి. రద్దు చేసిన ఐటీఐఆర్ ని తెప్పించాల్సిన బాధ్యత కిషన్ రెడ్డి.. సంజయ్ లదే అని జగ్గారెడ్డి అన్నారు. రెచ్చగొట్టడం కాదు.. ఉద్యోగాల కల్పనపై దృష్టి పెట్టండని, చేరికల అంశం సీఎం పరిధిలోనిదన్నారు. నా పరిధికి మించి స్పందించను..రాహుల్ గాంధీకి ఇచ్చిన మాట తప్పన్నారు. ఐటీఐఆర్ upa ప్రభుత్వం మంజూరు చేసింది.. మోడీ సర్కారు రద్దు చేసిందని, తెలంగాణ యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని మా ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు జగ్గారెడ్డి. కానీ ఇన్నాళ్లు అధికారంలో ఉన్న బీజేపీ మంత్రులు కనీసం పట్టించుకోవడం లేదని, రద్దు కాకుండా అడ్డుకోలేక పోయారు కిషన్ రెడ్డి..సంజయ్ అని ఆయన అన్నారు. ఎన్డీఏ సర్కార్ ఐటీఐఆర్ రద్దు చేస్తే చర్చ లేకుండా పోయిందని, రెచ్చగొట్టి ప్రసంగాలు తప్పితే.. ఉద్యోగాల చర్చ లేదన్నారు.

అంతేకాకుండా..’యువత కూడా.. ఉద్యోగాలు ఇవ్వలేదనే దానిమీద కంటే రెచ్చగొట్టే వ్యాఖ్యలకు ఆకర్షితులు అవుతున్నారు. బీజేపీ నేతలు గుడికి వెళ్లి దీపం కూడా పెట్టరు కానీ.. గుళ్లు..గోపురాలు చుట్టే రాజకీయం తిప్పుతున్నారు. ITIR తో15 లక్షల ఉద్యోగావకాశాలు రాకుండా పోయింది. 15 లక్షల కుటుంబాలు ఉద్యోగాలకు దూరం అయ్యాయి. జెండాలు పట్టుకుని జై శ్రీరామ్ అంటారు కానీ.. బతకానికి అక్కరకు వచ్చే ITIR గురించి మాత్రం యువత పట్టించుకోరు. హైదరాబాద్ గడ్డ.. సేఫ్టీకి అడ్డా.. iTIR కి అనువైన ప్రాంతం అనే సోనియాగాంధీ మంజూరు చేశారు. కేంద్రమంత్రి కిషన్రెడ్డి.. సంజయ్ లకు డిమాండ్. ITIR ని తక్షణమే మంజూరు చేయించాలి. బండి సంజయ్ హైదరాబాద్ గడ్డ మీద అడుగుపెట్టగానే.. ఐటీఐఆర్ తెస్తా అని అంటే బాగుండేది..భాగ్యలక్ష్మి అమ్మవారిని బంగారు దేవాలయం చేస్తా అన్నాడు. ఆకలితో ఉన్న వాళ్లకు అన్నం పెట్టు..సెంటిమెంట్ తో రెచ్చగొట్టడం మానుకో. iTIR తెచ్చే వరకు కేంద్ర మంత్రులకు గుర్తు చేస్తూనే ఉంటా..కార్యాచరణ ప్రకటిస్తాం. చేరికల అంశం సీఎం పరిధిలోనిది. శాసన సభ వ్యవహారాల్లో నేను జోక్యం చేసుకొను. రాజకీయ వ్యవహారాల్లో నేను ఓ పరిధి విధించుకున్న. 14 నెలల కింద రాహుల్ గాంధీ నాకు ఓ మాట చెప్పారు. నికేదైనా ఇబ్బంది ఉంటే నాకు చెప్పండి అని అన్నారు.. ఆయన మాట జవదాటను. నాలో ఎన్ని ఆలోచనలు ఉన్నా.. మౌనంగా నే ఉంటా.‘ అని జగ్గారెడ్డి అన్నారు.