Site icon NTV Telugu

Jagapathi Babu: టాలీవుడ్ స్టైలిష్ విలన్ ఫిట్‌నెస్ సీక్రెట్ ఇదే!

Jagapathi Babu

Jagapathi Babu

Jagapathi Babu: ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న వ్యక్తి జగపతి బాబు. ఈ హీరో తన సెకండ్ ఇన్నింగ్స్‌లో స్టైలిష్ విలన్‌గా ఎంట్రీ ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాడు. ఇంతకీ 60 ఏళ్లు దాటినా ఆయన అంత ఫిట్‌గా ఉండటానికి కారణాలు ఏంటో తెలుసా.. ఇటీవల ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన ఫిట్‌నెస్ సీక్రెట్ రివీల్ చేశాడు. ఇంతకీ స్టైలిష్ విలన్‌ ఫిట్‌నెస్ సీక్రెట్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

READ ALSO: Buggana Rajendranath Reddy: పెర్ఫామెన్స్ వీక్.. పబ్లిసిటీ పీక్.. ఇప్పటికే రూ.3 లక్షల కోట్లకు పైగా అప్పు చేశారు..

ఆ ఇంటర్వ్యూలో జగపతి బాబు మాట్లాడుతూ.. 60 ఏళ్లు దాటినా తాను అంత ఫిట్‌గా ఉండటానికి కారణం ఆహారపు అలవాట్లు అని వెల్లడించారు. అలాగే క్రమం తప్పని వ్యాయామం కంటే మనసును ప్రశాంతంగా ఉంచుకోవడంపై ఎక్కువ శ్రద్ధ పెడతానని చెప్పారు. అనవసరమైన ఆలోచనలను పక్కన పెట్టి, ప్రస్తుత క్షణంలో బతకడమే తన ఫిట్‌నెస్ వెనుక ఉన్న అసలైన సీకెట్ర్ అని వెల్లడించారు. ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న జగపతి బాబు కెరీర్‌లో, ఒకానోక దశ తర్వాత ఆయన ఆర్థికంగా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. నిజానికి ‘లెజెండ్’ సినిమాతో ఆయన విలన్‌గా మారడం తన జీవితంలో అతిపెద్ద మలుపుగా జగపతి బాబు చెబుతుంటారు. హీరోగా ఉన్నప్పుడు రాని గుర్తింపు, విలన్‌గా మారిన తర్వాత విభిన్న పాత్రల ద్వారా లభిస్తోందని ఆయన పలు ఇంటర్వ్యూలలో వెల్లడించారు. ప్రస్తుతం ఈ స్టైలిష్ విలన్ తన సెకండ్ ఇన్సింగ్స్‌లో సూపర్ హిట్స్ రోల్స్‌తో సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతున్నారు.

READ ALSO: Adurs 2: చారి ఈజ్ బ్యాక్.. ‘అదుర్స్ 2’ స్క్రిప్ట్ రెడీ.. ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా?

Exit mobile version