Site icon NTV Telugu

Bolisetty Srinivas: ఈడీ కేసుల్లో జగన్ అరెస్ట్ ఖాయం.. టీడీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు..

Bolisett Srinivas

Bolisett Srinivas

గతంలో ఉన్న ఈడీ కేసుల్లో జగన్ అరెస్ట్ కావడం ఖాయమని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. పశ్చిమగోదావరిజిల్లా తాడేపల్లిగూడెంలో ఆయన మాట్లాడారు. జగన్ హయాంలో అవినీతిలేని డిపార్ట్‌మెంట్ లేదని.. జగన్ ఖచ్చితంగా జైలుకు వెళతారు.. తప్పలు చేసినవారిక శిక్ష తప్పదని సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబును 53రోజులు జైల్లో ఉంచి ఏం నిరూపించగలిగారు? అని ప్రశ్నించారు. కక్షసాధింపు చర్యలకు జనసేన వ్యతిరేకమని.. జనసేన ఓడినపుడు విమర్శిస్తున్నారు.. గెలిచినపుడూ విమర్శిస్తున్నారన్నారు.. రోజా మాట్లాడిన మాటలే కాదు.. జక్కంపూడి రాజా సైతం రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారన్నారు..
కుక్కుల మెరుగుతూ ఉంటాయి వాటికి సమాధానాలు చెబితే పిచ్చోళ్ళం అయిపోతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.

READ MORE: Gandikota Murder Case: గండికోట మైనర్ బాలిక హత్య కేసు.. కీలక ఆధారాలు లభ్యం..!

ఏడాది అయ్యేటప్పటికి జనం అన్ని మర్చిపోతారని వైసీపీ భావిస్తోందని.. కలలో కూడా జగన్ సీఎం అవ్వరు.. రాసిపెట్టుకోండి అని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. కాపుకులమంతా జనసేన వెనుక నిలబడిందని.. అంబటి, పెర్నిలాంటి అవుడేటెడ్ వాళ్ళను పట్టించుకునే పరిస్థితిలేదన్నారు.. ఏదైనా సమస్య ఉంటే 11మంది అసెంబ్లీకి వచ్చి పోరాలని చెప్పారు. జైలుకు జగన్ ఎందుకు వెళ్ళరో జనం చూస్తున్నారని.. చీప్ లిక్కర్ తాగి ఎంతో మంది బాధితులయ్యారన్నారు.. వైసీపీ వాళ్ళు గెలిచినా పనిచేయరు.. ఓడినా పనిచేయరని ఆరోపించారు..

READ MORE: Pakistan: పాక్ మిస్సైల్ విఫలం.. సొంత ప్రజలపైనే కూలిన షాహీన్-3 క్షిపణి..

Exit mobile version