Site icon NTV Telugu

CM Jagan : నేడు జగనన్న సురక్ష కార్యక్రమం ప్రారంభం

Ap Cm Jagan

Ap Cm Jagan

నేడు జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ఉదయం 11 గంటలకు ప్రారంభించనున్నారు సీఎం జగన్‌. నెలరోజల పాటు ఈ కార్యక్రమం జరుగనుంది. నేటి నుంచి పార్టీ నేతలు, గృహ సారథులకు శిక్షణ ఇవ్వనున్నారు. వచ్చే నెల 1 నుంచి ఇంటింటికీ కేడర్‌ తిరగనుంది. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామ, వార్డు సచివాలయ పరిధిలో ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేయనున్నారు.. ఈ కార్యక్రమాన్ని జులై 1 నుంచి ప్రారంభిస్తారు.. ప్రజలకు అవసరమైన ధ్రువీకరణ పత్రాలు అందజేయడమే ఈ శిబిరాల లక్ష్యంగా పెట్టుకున్నారు.. తరుచూ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పనిలేకుండా.. స్పాట్‌లోనే సర్టిఫికేట్స్‌ ఇచ్చే జగనన్న సురక్ష కార్యక్రమాన్ని నెల రోజుల పాటు నిర్వహించబోతున్నారు.. సచివాయల స్థాయిలోనే సమస్యలను పరిష్కరించి, ప్రతి పౌరుడి ముఖంలో చిరునవ్వు చూడడమే ప్రభుత్వ లక్ష్యం అంటున్నారు.

Also Read : Part Time Jobs: పార్ట్ టైం జాబ్ పేరిట టెలిగ్రామ్ మెసేజ్‌.. లక్షలు కొట్టేసిన కేటుగాళ్ళు

ఈ క్యాంపు ద్వారా ప్రతి పౌరుడి సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేయనుంది..ప్రతి కుటుంబం యొక్క పథకాలు, పత్రాల సమస్యలను పరిష్కరించడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యంగా ఉంది.. వాలంటీర్లు, గృహ సారథులు ప్రతి ఇంటికి వెళ్లి జగనన్న సురక్షా గురించి అవగాహన కలిపిస్తారు.. అంటే రాష్ట్రంలోని 1.6 కోట్ల కుటుంబాల వద్దకే అధికారులు వెళ్లనున్నారు.. ఈ సురక్షా క్యాంపులు 15 వేల సచివాలయాల్లో నిర్వహించనున్నారు.. ముందుగా గుర్తింపబడిన పత్రాలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి అధికారులు ప్రతి సచివాలయంలో ఒక రోజు క్యాంపు నిర్వహిస్తారు.. 100 శాతం అర్హులను ప్రభుత్వ పథకాల్లో చేర్చడం మరియు పత్రాల సమస్యలకు సత్వర పరిష్కారం చూపడమే ఈ కార్యక్రమం యొక్క టార్గెట్‌.

Also Read : Virat Kohli: విరాట్ కోహ్లీని భారత జట్టుకి ఎంపిక చేసి.. నా పదవిని కోల్పోయా! మాజీ చీఫ్ సెలెక్టర్ షాకింగ్ కామెంట్స్

Exit mobile version