NTV Telugu Site icon

Jagananna Suraksha : జగనన్న సురక్ష ప్రచారంలో చారిత్రాత్మక మైలురాయి

Jagananna Suraksha

Jagananna Suraksha

జగనన్న సురక్ష ప్రచారంలో ఒక చారిత్రాత్మక మైలురాయిని ప్రకటించినందుకు మేము సంతోషిస్తున్నామని ఏపీ ప్రభుత్వం వెల్లడించింది. జగనన్న సురక్ష పథకంతో 50 లక్షలకుపైగా మందికి అవసరమైన ధృవపత్రాలతో సాధికారత కల్పించారని, ఆంధ్రప్రదేశ్ అంతటా 9725 శిబిరాలు నిర్వహించి 1.13 కోట్లకుపైగా కుటుంబాలు సర్వే చేయబడ్డాయని తెలిపారు. ప్రతి పౌరుడి సంక్షేమం పట్ల వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి ఉన్న తిరుగులేని నిబద్ధతకు ఈ ఘన విజయం నిదర్శనమని తెలిపారు. ఈ అద్భుతమైన విజయాన్ని జరుపుకోవడంలో మాతో చేరండి మరియు జగనన్న సురక్ష క్యాంపెయిన్ గురించి ప్రచారం చేయండి, ఇది జీవితాలను మారుస్తుంది మరియు అందరికీ ఉజ్వల భవిష్యత్తును భద్రపరుస్తుంది.. అంటూ.. #JaganannaSuraksha #AndhraPradeshProgress అంటూ హ్యాష్‌ట్యాగ్‌లను షేర్‌ చేసింది.

Also Read : CM Jagan : ఇన్ని లక్షలమంది చిరువ్యాపారులకు ఎక్కడా ఇంత మేలు జరడం లేదు

ఇదిలా ఉంటే.. వ్యక్తిగత ప్రజా వినతులను సైతం సంతృప్తిస్థాయిలో పరిష్కరించడమే లక్ష్యంగా అన్ని గ్రామ, వార్డు సచివాలయాల వద్ద మండలస్థాయి అధికారుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జగనన్న సురక్ష క్యాంపుల నిర్వహణ ఖర్చుకు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం రూ.25 కోట్లు విడుదల చేసింది. ప్రభుత్వ ఆఫీసుల్లో అవసరం పడే వివిధ రకాల ధ్రువీకరణ పత్రాల జారీతో పాటు సంక్షేమ పథకాల అమలులో అర్హులైన వారు ఒక్కరూ మిగిలి పోకూడదన్న లక్ష్యంగా ప్రభుత్వమే వాలంటీర్ల ద్వారా ఇంటింటా జల్లెడపడుతూ సర్వే నిర్వహించి, వారికి సంబంధించిన వినతుల పరిష్కారం కోసం జగనన్న సురక్ష పేరుతో ప్రత్యేకంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సచివాలయాల వద్ద క్యాంపుల నిర్వహణకు గ్రామ సచివాలయానికి రూ.15 వేల చొప్పున, పట్టణ ప్రాంతాల్లో క్యాంపులు జరిగే వార్డు సచివాలయానికి రూ.25 వేల చొప్పున ఈ నిధులను విడుదల చేశారు. వీటికితోడు అదనంగా ప్రతి జిల్లాకు రూ.మూడు లక్షల చొప్పున కలెక్టర్లుకు విడుదల చేశారు. ఈ నిధులను గ్రామ, వార్డు సచివాలయాల శాఖ శుక్రవారం ఆయా సచివాలయాల బ్యాంకు ఖాతాల్లో జమచేసింది.

Also Read : Chandrayaan-3: విమానం నుంచి చంద్రయాన్-3 రాకెట్ ప్రయోగం.. వీడియో వైరల్