Site icon NTV Telugu

YS Jagan: విశాఖ గూగుల్ డేటా సెంటర్ క్రెడిట్ వీళ్లదే.. జగన్ సంచలన వ్యాఖ్యలు..!

Ys Jagan

Ys Jagan

YS Jagan: ఇక యాడ్ ఏజెన్సీల రాష్ట్ర ప్రభుత్వ పాలన అని మాజీ సీఎం జగన్ విమర్శించారు.. తాజాగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రసంగించారు. మాటలు చూస్తే కోటలు దాటుతున్నాయి.. పెర్ఫార్మెన్స్ మాత్రం వీక్ అన్నారు.. వేరే వాళ్ళకు దొరకాల్సిన క్రెడిట్ చోరీలో మాత్రం చంద్రబాబు పీక్ అని విమర్శించారు.. గత ప్రభుత్వ హయాంలో ఇంటర్నేషనల్ హబ్ గా విశాఖను తీర్చిదిద్దే పనిలో భాగంగా అదానీ డేటా సెంటర్‌కు బీజం పడిందని తెలిపారు. సింగపూర్ నుంచి సబ్సీ కేబుల్ తీసుకువచ్చే కార్యక్రమానికి అంకురార్పణ కూడా అప్పుడే జరిగిందని చెప్పారు.. సబ్సీ కేబుల్ తీసుకురాకపోతే ఏ డేటా రాదని.. అదానీ డేటా సెంటర్ కు ఫౌండేషన్ వేయటం వల్లే ఇది సాధ్యమైందన్నారు.. ఇది జరగటానికి వైసీపీ, అదానీ, కేంద్రం, సింగపూర్ చేసిన కృషి వల్లే ఇవాళ గూగుల్ విశాఖ వచ్చిందని కొనియాడారు.. ఆరోజు వైసీపీ కృషి వల్లే ఇప్పుడు గూగుల్ రావటానికి మార్గమైందని వెల్లడించారు. అదానీ పెట్టిన ప్రాజెక్టుకు ఇది విస్తరణ.. అక్టోబర్ 2022 నుంచి అదానీకి.. గూగుల్ కు బిజినెస్ రిలేషన్ షిప్ ఉందని మాజీ సీఎం వైఎస్ జగన్ తెలిపారు.. ఈ నేపథ్యంలోనే విశాఖలో మే 2023 లో ఫౌండేషన్ స్టోన్ వేశామన్నారు.. సబ్సీ కేబుల్ కు అంకురార్పణ కూడా అప్పుడే జరిగిందని తెలిపారు.

READ MORE: India vs Australia: మెరిసిన రోహిత్, శ్రేయస్‌.. ఆస్ట్రేలియా టార్గెట్‌ ఎంతంటే..?

సముద్ర గర్భంలో సింగపూర్ నుంచి విశాఖ వరకు అదానీ సబ్సీ కేబుల్ వేయటం వల్లే గూగుల్ వచ్చిందని మాజీ సీఎం జగన్ వివరించారు.. ఆ రెండు కంపెనీలు వ్యాపార భాగస్వాములు కాబట్టే డేటా సెంటర్ విశాఖ వచ్చిందన్నారు.. 300 మెగావాట్ల డేట్ సెంటర్ కు అప్పుడు వైసీపీ వేసిన అడుగుల వల్లే సాధ్యమైందన్నారు.. “అదానీ ఇన్ఫ్రా కు సంబంధించిన వాళ్ళే ఈ డేటా సెంటర్ నిర్మిస్తున్నారు.. గూగుల్ నుంచి అలెగ్జాండర్ స్మిత్ ఐటీ సెక్రటరీ గా ఉన్న భాస్కర్ కు ఓ లెటర్ కూడా రాశారు.. అదానీ కి చెందిన మూడు కంపెనీలకు ల్యాండ్ అలాట్ చేయాలని కోరారు.. ఈ ప్రాజెక్ట్ తేవటం కోసం 87 వేల కోట్లు అదానీ ఖర్చు చేసి గూగుల్ ని తీసుకువస్తునారు.. అదానీ 10 మిలియన్ డాలర్లు ఖర్చు చేస్తేనే గూగుల్ వస్తుంది.. ఇలాంటి డేటా సెంటర్ అదానీ లాంటి మన దేశీయ కంపెనీ పెడుతుందని గర్వంగా చెప్పుకోవాలి.. క్రెడిట్ ఎవరికి ఇవ్వాలి.. కనీసం అదానీ కి ఒక థాంక్స్ అయినా చెప్పారా.. ఇదంతా చెప్తే జగన్ ప్రభుత్వం లోనే జరిగిందని క్రెడిట్ ఇవ్వడం చంద్రబాబు కు ఇష్టం లేదు.. డేటా సెంటర్ లో అతిముఖ్యమైన అంశం సముద్ర గర్భంలో వేస్తున్న కేబుల్.. 3900 కిలోమీటర్ల మేరా కేబుల్ వేయాలి.. అంతా పూర్తయిన తర్వాత చంద్రబాబు సుందర ముఖారవిందాన్ని చూసి వీళ్ళు వచ్చినట్లు చెప్పుకుంటున్నారు.. గతంలో 300 మెగావాట్ల డేటా సెంటర్ కోసం భూ కేటాయింపులు చేశాం.. ప్రపంచాన్ని శాసించబోయే టెక్నాలజీ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్.. వీటికి డేట్ సెంటర్ కీ ఫ్యాక్టర్ గా పనిచేస్తుంది.. 300 మెగావాట్ల డేటా సెంటర్ పెడితే 25 వేల ఉద్యోగాలు ఇవ్వాలని కోరాం.. ఐటీ పార్క్, స్కిల్ యూనివర్సిటీ పెట్టాలని కోరాం.. చంద్రబాబు ఇలా చేయటం కొత్తకాదు.. హైదరాబాద్ విషయంలో కూడా చంద్రబాబు ది సేమ్ స్టోరీ.. మాదాపూర్ సైబర్ టవర్స్ ఆరెకరాల స్థలంలో వచ్చిన చిన్న ప్రాజెక్ట్.. దీనికి పునాది రాయి వేసింది ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్ జనార్ధన్ రెడ్డి.. ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు దాన్ని ప్రైవేట్ వాళ్లకు ఇచ్చి కట్టించాడు.. ఆ బిల్డింగ్ ఒకటి కట్టి హైదరాబాద్ మొత్తం నేనే కట్టాను అని ప్రొజెక్షన్ చేసుకున్నాడు.. 2004, 2009 వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా గెలిచారు.. 2014, 2019 లో కేసీఆర్ గెలిచాడు.. అయిన ఈ 20 ఏళ్ల అభివృద్ధి నాదే అంటాడు.. ఒక్క బిల్డింగ్ కట్టి అభివృద్ధి మొత్తం నాదే అనటం మూర్ఖత్వం.. వైఎస్ఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఓఆర్ఆర్, పీవీ ఎక్స్ ప్రెస్ హైవే, శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఇవన్నీ వచ్చాయి కాబట్టే హైదరాబాద్ అంతలా అభివృద్ధి చెందింది.. ఐటీ ఎక్స్పోర్ట్స్ కూడా చంద్రబాబు దిగిపోయిన తర్వాత భారీగా పెరిగాయి.. 2009 నాటికి 5600 కోట్ల నుంచి 39 వేల కోట్లకు ఐటీ ఎగుమతులు దాటాయి.. 2014 నాటికి 56 వేలకోట్లు దాటాయి.. వేరే వాళ్ళు చేస్తే ఆ క్రెడిట్ వాళ్లకు ఇవ్వాలి.. కేసీఆర్ వచ్చిన తర్వాత గొప్ప పరిపాలన చేశారు కాబట్టే అభివృద్ధి సాధ్యం అయ్యింది.. కేసీఆర్ 2 లక్షల కోట్లకు పైగా ఐటీ ఎగుమతులు తీసుకువెళ్ళారు.. 2004 లో పాలన వదిలేసి ఇప్పటికీ అంతా నేనే వేశా అని చెప్పుకునే చంద్రబాబు.. విశాఖ దేశంలోని ఇతర మెట్రో నగరాలను తలదన్నేలా అడుగులు వేశాం.. భోగాపురం ఎయిర్ పోర్టు కు మేమే అన్నీ చేశాం.. మరో ఏడాదిలో పూర్తి కూడా అవుతుంది.. ఉత్తరాంధ్ర దశ దిశ మార్చటం కోసం పోర్టు నిర్మాణం చేపట్టాం..” అని మాజీ సీఎం జగన్ వ్యాఖ్యానించారు.

READ MORE: Jubilee HIlls Bypoll : 135 సెట్ల నామినేషన్లకు ఆమోదం..

 

Exit mobile version