వైసీపీ వేమూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ వరికూటి అశోక్‌బాబుతో ఫోన్‌లో మాట్లాడి పరామర్శించారు మాజీ సీఎం వైఎస్ జగన్.. ఘటన వివరాలు తెలుసుకున్నారు. సాగునీటి కాలువలు గుర్రపు డెక్కతో నిండిపోయి పంటపొలాలకు నీరు రావడం లేదంటూ రైతుల కష్టాలపై రేపల్లెలో నిరసన వైసీపీ కార్యకర్తల నిరసనలో వేమూరు నియోజకవర్గ ఇంఛార్జ్ వరికూటి అశోక్‌బాబుపై పోలీసుల దాడిని జగన్ ఖండించారు. వేలాది మంది రైతుల తరుపున పోరాడుతూ.. వారి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళేందుకు అశోక్‌బాబు చేస్తున్న ప్రయత్నాన్ని అణిచివేయాలని చూడడం దారుణమన్నారు. రైతాంగానికి మంచి జరిగే కార్యక్రమం చేయడం అభినందనీయమని అశోక్‌బాబును ప్రసంసించారు. అశోక్‌బాబు ఆరోగ్య వివరాలు తెలుసుకుని జాగ్రత్తగా ఉండాలని.. అవసరమైన పూర్తి సహాయసహకారాలు పార్టీ నుంచి అందుతాయని జగన్ భరోసా ఇచ్చారు..
READ MORE: Rajnath Singh: దమ్ముంటే ఆ ‘‘అణుబాంబు’’ పేల్చు.. రాహుల్ గాంధీకి రాజ్‌నాథ్ సవాల్..
