Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Amaravathi Jagan Ane Nenu Countdown Clock Start In Ysrcp Office

Jagan Ane Nenu Countdown: అప్పట్లో బై బై బాబు.. ఇప్పుడు జగన్‌ అనే నేను.. కౌంట్‌డౌన్‌ స్టార్ట్..!

Published Date :March 12, 2024 , 7:08 pm
By Sudhakar Ravula
Jagan Ane Nenu Countdown: అప్పట్లో బై బై బాబు.. ఇప్పుడు జగన్‌ అనే నేను.. కౌంట్‌డౌన్‌ స్టార్ట్..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Jagan Ane Nenu Countdown: ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కాకముందే.. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు హీట్‌ పెంచుతున్నాయి.. ఓవైపు సిద్ధం పేరుతో అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ భారీ బహిరంగ సభలు నిర్వహిస్తూ ఎన్నికల ప్రచారంలో దూకుడు చూపిస్తుండగా.. మరోవైపు ఇప్పటికే టీడీపీ-జనసేన ఉమ్మడిగా సభలు నిర్వహిస్తూ.. వైసీపీపై కౌంటర్‌ ఎటాక్‌కు దిగుతున్నారు.. ఇక, ఇప్పుడు టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తు ఖరారు కావడం.. సీట్లపై కూడా క్లారిటీ రావడంతో.. ఆ మూడు పార్టీలు ఉమ్మడిగా భారీ బహిరంగ సభలు నిర్వహించేలా ప్లాన్‌ చేస్తున్నాయి.. అయితే, గత ఎన్నికల సమయంలో.. ప్రచారంలో తన మార్క్‌ చూపించింది వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ.. ప్రశాంత్‌ కిషోర్‌ నేతృత్వంలోని ఐ ప్యాక్‌ టీమ్‌.. విస్తృతంగా నెగిటివ్ ప్రచారం తీసుకొచ్చింది.. అప్పట్లో హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైసీపీ ప్రధాన కార్యాలయం ముందు ‘బైబై బాబు..’ అంటూ కౌంట్‌డౌన్‌ క్లాక్‌ ఏర్పాటు చేశారు.. రాష్ట్రంలోని ఇతర వైసీపీ ఆఫీసుల వద్ద కూడా ఇది దర్శనం ఇచ్చాయి..

Read Also: Congress: కాంగ్రెస్ రెండో జాబితా విడుదల.. కమల్‌నాథ్‌కు ఉపశమనం

Also Read

  • వందేళ్ల వైభవానికి అరుదైన గౌరవం.. Andhra Universityకు కేంద్రం ప్రత్యేక గుర్తింపు
  • KCR : రాష్ట్రం బొందలో పడ్డట్టు అయింది.. ఇది ఒక చిల్లర ప్రభుత్వం..!
  • Petrol Shortage: పెట్రోల్ బంకుల్లో నిబంధనలు.. ద్విచక్ర వాహనానికి రూ.200, కారుకు రూ.1000 మాత్రమే..
  • CM Revanth Reddy : BRS ఒక చచ్చిపోయిన శవం.. దానికి భవిష్యత్తు లేదు

అయితే, ఈ సారి ప్రచారంలో తన పంతాను మార్చింది వైసీపీ.. రాష్ట్రంలో వైఎస్‌ జగన్‌ సర్కార్‌ కొలువుదీరి ఐదేళ్లు పూర్తి కావస్తున్న తరుణంలో.. మళ్లీ ఎన్నికలకు సమయం వచ్చింది.. గతంలో 151 సీట్లలో విజయంతో ప్రభంజనం సృష్టించిన వైసీపీ.. ఇప్పుడు వైనాట్‌ 175 పేరుతో ప్రచారం చేస్తోంది.. అంతేకాదు.. వైనాట్‌ కుప్పం అంటూ సీఎం జగన్‌ ఆ పార్టీ శ్రేణుల్లో జోష్‌ పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు. నీ బిడ్డ ప్రభుత్వంలో మీకు మంచి చేకూరింది.. లబ్ధి జరిగితేనే ఓటు వేయాలని కోరుతున్నారు సీఎం జగన్‌.. ఎన్ని పార్టీలు జత కట్టినా.. టీడీపీ-జనసేన-బీజేపీ గుంపుగా వచ్చినా.. సింహం సింగిల్‌గానే వస్తుంది.. మరో సారి అధికారంలోకి వైసీపీ వస్తుందనే ధీమా వ్యక్తం చేస్తున్నారు.. ఇదేసమయంలో.. గతంలో బైబై పేరుతో కౌంట్‌డౌన్‌ క్లాక్‌ ఏర్పాటు చేసినట్టుగానే.. ఇప్పుడు మరో 73 రోజుల్లో తిరిగి అధికారంలోకి వస్తామనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ ”జగన్‌ అనే నేను” పేరుతో కౌంట్‌డౌన్‌ క్లాక్‌లు ఏర్పాటు చేశారు..

Read Also: Odisha: ఎన్నికల వేళ మహిళా ఉద్యోగులకు నవీన్ సర్కార్ గుడ్‌న్యూస్

ఈ కొత్త కౌంట్‌డౌన్‌ క్లాక్‌ను వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా తాడేపల్లిలోని వైసీపీ ప్రధాన కార్యాలయంలో మంత్రి జోగి రమేష్‌తోపాటు ఆ పార్టీ నేతలు “జగన్‌ అనే నేను” పేరుతో ఏర్పాటు చేసిన కౌంట్‌డౌన్‌ క్లాక్ బోర్డును ఆవిష్కరించారు. ఆ కౌంట్‌డౌన్‌ క్లాక్‌ ప్రకారం.. మరో 73 రోజుల్లో వైసీపీ తిరిగి అధికారం చేపడుతుందనే విధంగా క్లాక్‌ కౌంట్‌డౌన్‌ కొనసాగుతోంది.. ఇక, ‘జగన్ అనే నేను..’ అంటే మరోసారి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేస్తారని ఆ కౌంట్‌డౌన్‌ క్లాక్‌తో చెప్పకే చెబుతోంది వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • CM YS Jagan
  • Jagan ane nenu countdown
  • Tadepalli
  • YCP 14th formation day

తాజావార్తలు

  • Sorakaya Garelu Recipe: కరకరలాడే కమ్మని సొరకాయ గారెలు.. 10 నిమిషాల్లో ఇలా రెడీ చేసేయండి.!

  • Sun Pharma: అమెరికా గడ్డపై భారత ఫార్మా జెండా.. లక్ష కోట్లతో దిగ్గజ కంపెనీని కొనుగోలు చేసిన సన్ ఫార్మా!

  • వందేళ్ల వైభవానికి అరుదైన గౌరవం.. Andhra Universityకు కేంద్రం ప్రత్యేక గుర్తింపు

  • Fire Accident : అంబర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం.. తగలబడిన షోరూం గోదాం..

  • KCR : రాష్ట్రం బొందలో పడ్డట్టు అయింది.. ఇది ఒక చిల్లర ప్రభుత్వం..!

ట్రెండింగ్‌

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions