Site icon NTV Telugu

Jagadish Shettar : బీజేపీకి బిగ్ షాక్.. ఎన్నికలకు ముందు పార్టీకి మాజీ సీఎం రాజీనామా

Shettor

Shettor

Jagadish Shettar : మరి కొన్ని రోజుల్లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనున్న నేపథ్యంలో అధికార బీజేపీ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ సీఎం జగదీష్ షెట్టర్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ ఎన్నికల్లో పార్టీ తరపున పోటీ చేయాలనుకున్న ఆయనకు నిరాశే మిగిలింది. దీంతో ఆయన ఢిల్లీకి వెళ్లి పార్టీ జాతీయ అధ్యక్షుడితో సమావేశమైప్పటికీ టికెట్ మాత్రం రాలేదు. దీంతో తీవ్ర కోపానికి గురైన షెట్టర్.. బీజేపీ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నారు. ఇది పార్టీకి తీవ్ర నష్టం కలిగిస్తుందని అంచనాలు వెలువడుతున్నాయి.

Also Read : Adimulapu Suresh: సీఎం జగనే వైఎస్‌ వివేకా కేసును సీబీఐకి ఇవ్వమని చెప్పారు..

సీఎం బసవరాజ్ బొమ్మైని కలిసిన తర్వాత పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయన సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు శాసనసభలో ప్రతిపక్ష నేతగా కూడా వ్యవహారించాడు. ఈ ఎన్నికల్లో తాను కచ్చితంగా పోటీ చేస్తానని షెట్టర్ క్లారిటీ ఇచ్చారున. అయితే ఏదైనా పార్టీలో చేరి పోటీ చేస్తారా.. లేదంటే స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతారా అనే విషయాన్ని మాత్రం చెప్పలేదు. కొద్ది రోజుల నుంచి బీజేపీ నేతలు తన పట్ల వ్యవహరిస్తున్న తీరు తనకు తీవ్ర అవమానకరమని అన్నారు. పార్టీ నేతలు తనను కించపరచినందు వల్లే తాను రాజీనామా చేయాలనే నిర్ణయం తీసుకున్నానని షెట్టర్ వెల్లడించాడు.

Also Read : Children’s Dance : ‘పర్దేశియా’ సాంగ్‌కి దుమ్మురేపుతున్న చిన్నారులు

రాష్ట్రంలో కొందరు నేతలు బీజేపీ వ్యవస్థను దుర్వినియోగపరుస్తున్నారన్నరని షెట్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తొందరలోనే తాను ఏ పార్టీ నుంచి పోటీ చేస్తానో చెప్పానని ఆయన అన్నారు. తాను ఎమ్మెల్యే పదవికి బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయబోతున్నానని తెలిపారు. బీజేపీ ఉన్నత స్థాయి వర్గాలు స్పందిస్తూ.. షెట్టర్ పార్టీ కన్నా తనకు తాను పెద్ద పీట వేసుకున్నాడని విమర్శించాయి. తాను పార్టీ కన్నా గొప్పవాడిననే భావంతో వ్యవహరించారని.. బీజేపీ పెద్దలు ఆయనతో మాట్లాడటానికి అనేకసార్లు ప్రయత్నించినట్లు తెలిపారు. ఆయనకు పార్టీ అనేక అప్షన్స్ ఇచ్చిందని కూడా వారు వెల్లడించారు.

Also Read : Kishan reddy vs Harish rao: ఎంఎన్ జే కొత్త బ్లాక్ ఓపెన్ చేసి.. మధ్యలోనే వెళ్లిపోయిన కిషన్ రెడ్డి

కేంద్ర మంత్రి, కర్ణాటక బీజేపీ ఎన్నికల ఇన్ చార్జ్ ధర్మేంద్ర ప్రధాన్, సీఎం బసవరాజ్ బొమ్మై శనివారం షెట్టార్ తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మరొ బీజేపీ కీలక నేత ప్రహ్లాద్ జోషీ కూడా పాల్గొన్నారు. హుబ్బళి-ధార్వాడ్ సెంట్రల్ నియోజకవర్గం టిక్కెట్ విషయంలో షెట్టార్ అల్టిమేటం ఇచ్చిన నేపథ్యంలో ఈ సమావేశం జరిగింది. ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీజేపీ టికెట్లు దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తికి లోనైన పలువురు నేతలు ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నారు. ఒకప్పటి జనతాపరివార్ కు చెందిన ప్రముఖ నేత బీ సోమశేఖర్ శనివారం నాడు రాజీనామా చేశాడు.

Exit mobile version