Site icon NTV Telugu

Jagadish Reddy : సమాజానికి దిక్సూచి ‘ఉపాధ్యాయుడు’

Jagadish Reddy

Jagadish Reddy

సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో విద్యాశాఖ అధ్వర్యంలో గురుపూజోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించి, ప్రశంసా పత్రాలు అందజేశారు మంత్రి జగదీష్ రెడ్డి. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సమాజానికి దిక్సూచి ‘ఉపాధ్యాయుడు’ అని కొనియాడారు. విద్యావంతుల తయారీలో వారి పాత్ర ఎనలేనిదని, విద్యారంగంలో పెను మార్పులు చేపట్టిన ఘనత సీఎం కేసీఆర్‌ దే అని ఆయన వ్యాఖ్యానించారు.

Also Read : PM Modi: ఇండోనేషియా పర్యటనకు ప్రధాని.. ఆసియా సదస్సులో పాల్గొననున్న మోడీ

దేశంలో విద్యారంగ ప్రక్షాళ‌న కేసీఆర్ తోనే సాధ్యమని ఆయన అన్నారు. రోల్‌మోడల్‌గా తెలంగాణ గురుకులాలు తీర్చిదిద్దామని, భారతీయ తాత్విక దృక్పథాన్ని ప్రపంచ దేశాలకు అందించిన గొప్ప వ్యక్తి సర్వేపల్లి రాధాకృష్ణ అని ఆయన అన్నారు. ప్రైవేట్‌ బాట వీడి గురుకులాల్లో చాలా మంది విద్యార్థులు చేరుతున్నారంటే.. వీటిని ఏ స్థాయిలో అభివృద్ధి పర్చారో అర్థం చేసుకోవచ్చన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాలు ఉండగా.. వేలాది మంది విద్యను అభ్యసిస్తూ లబ్ధి పొందుతున్నారని పేర్కొన్నారు. విద్యారంగంలో కొత్త శకం ఆవిష్కృతం అవుతుందన్నారు. ఈ విజయంలో ఉపాధ్యాయుల పాత్ర మరువలేనిది అని కొనియాడారు. సమాజానికి దిక్సూచి ‘ఉపాధ్యాయుడు’ అని కొనియాడారు.

Also Read : Article 370: ఆర్టికల్ 370 రద్దుపై తీర్పును రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు..

Exit mobile version