NTV Telugu Site icon

Jagadish Reddy : కొంత మంది కుహనా మేధావులు అర్థం లేని ఆరోపణలు చేశారు

Jagadish Reddy

Jagadish Reddy

జస్టిస్ నరసింహ రెడ్డి కమిషన్ కు నాకు తెలిసిన, గుర్తు ఉన్న సమాచారంను లేఖ రూపంలో పంపానని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. ఇవాళ జగదీష్‌ రెడ్డి మాట్లాడుతూ.. మా ప్రభుత్వం హయంలో విద్యుత్ ఒప్పందాలపై ఇతరుల లేవనెత్తిన అనుమానాలకు కూడా సరిపోయే పద్ధతిలో లేఖలో సమాధానం ఇచ్చానని, విద్యుత్ ఒప్పందాలపై కొంత మంది కుహనా మేధావులు అర్థం లేని ఆరోపణలు చేశారన్నారు జగదీష్‌ రెడ్డి. PGCL లైన్ ను తెలంగాణ రాష్ట్ర అవసరాల కోసం బుక్ చేసుకున్నామని, ఛత్తీస్ ఘడ్ తో విద్యుత్ ఒప్పందం, PGCL కు లింక్ ఉంది …రెండు కూడా తెలంగాణ అభివృద్ధి కోసమే అని ఆయన వ్యాఖ్యానించారు. విద్యుత్ అత్యవసర అవసరాల దృష్ట్యా భద్రాద్రి ప్లాంట్ ను సబ్ క్రిటికల్ టెక్నాలజీ తో వెళ్ళామని, BHEL సంస్థ ప్రతిపాదనతోనే అని ఆయన పేర్కొన్నారు.

అంతేకాకుండా..’భద్రాద్రి ప్లాంట్ ను సబ్ క్రిటికల్ టెక్నాలజీ తో చేపట్టాం ..రెండు సంవత్సరాల లో పూర్తి చేస్తామని BHEL చెప్పింది. విద్యుత్ ప్లాంట్ లకు సబ్ క్రిటికల్ టెక్నాలజీ వడవద్ధని కేంద్ర ప్రభుత్వ చట్టాల్లో ఎక్కడా లేదు. వాస్తవాలు తెలుసుకోకుండా జస్టిస్ నరసింహ రెడ్డి మాట్లాడారు …ఇప్పుడు మార్చుకుంటారు అని అనుకుంటున్న . విద్యుత్ ఒప్పందాల్లో భాగస్వామ్యం అయిన రమన్ సింగ్ ను కూడా విచారించాలి కదా ? విద్యుత్ ప్లాంట్ లకు అనుమతులు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వ సంస్థలను కూడా పిలిచి విచారించాలి కదా ? సహజ న్యాయ సూత్రాల ప్రకారం అందరినీ పిలిచి విచారించాలి కదా ? కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మెమో తో సబ్ క్రిటికల్ ,సుపర్ క్రిటికల్ అన్న చర్చ లేదు. యాదాద్రి పవర్ ప్లాంట్ విషయంలో ఆరోపణలు చేస్తున్న వారిది మూర్ఖపు వాదన. వాస్తవాలు తెలుసుకోకుండా జస్టిస్ నరసింహ రెడ్డి మాట్లాడారు …ఇప్పుడు మార్చుకుంటారు అని అనుకుంటున్న’ అని జగదీష్‌ రెడ్డి తెలిపారు.