NTV Telugu Site icon

Jagadish Reddy : రైతు బంధు ఆపడానికి వీలు లేదు

Jagadish Reddy

Jagadish Reddy

రైతు బంధు ఆపడానికి వీలు లేదని బీఆర్‌ఎస్‌ ఎమ్మె్ల్యే జగదీష్ రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రైతు భరోసా పై కాంగ్రెస్ మాట తప్పిందన్నారు. రైతు భరోసా ఇస్తున్నట్టు చెప్పారు… మరి కేబినెట్‌ సబ్ కమిటీ ఎందుకు వేశారు..? అని ఆయన ప్రశ్నించారు. రైతు బంధు ను బీఆర్‌ఎస్‌ సర్కార్ హయంలో జూన్ చివరి నాటికి వేసేవాళ్ళమని, రుణమాఫీ తో సంబంధం లేకుండా రైతు భరోసా అమలు చేయాలని BRS డిమాండ్ చేస్తుందన్నారు. మహిళలకు 2500 రూపాయల హామీ గురించి మాట్లాడం లేదన్నారు. కేబినెట్ సబ్ కమిటీ కేవలం రైతులను మోసం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని ఆయన తెలిపారు. కమిటీలతో అవసరం లేకుండా రైతు భరోసా ఇవ్వాలని, లా అండ్ ఆర్డర్ రాష్ట్రంలో దెబ్బతిన్నదని ఆయన అన్నారు. వీధి కుక్కలు జనం పై దాడి చేస్తున్నాయి …చైన్ స్నాచర్ల సంఖ్య పెరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు నెలలు అవుతున్నా ఒక్క పనిని మొదలు పెట్టలేదన్నారు.

రాష్ట్ర ప్రభుత్వానికి సోయి ఉందా లేదా అనేది అర్ధం కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఏ జిల్లాలోను శాంతిభద్రతలు బాగోలేవని, ప్రభుత్వం మాత్రం లీకేజీలు తప్ప ఒక్క హామీ నేరవేర్చలేదని దుయ్యబట్టారు. ఛత్తీస్ గఢ్ విద్యుత్ కొనుగోళ్లపై విచారణ జరుపుతోన్న విద్యుత్ కమీషన్ నుండి నాకు లెటర్ వచ్చిందని తెలిపారు. లేఖ ఇచ్చిన వారం రోజుల్లో కమీషన్‌కు వాంగ్మూలం ఇచ్చిన వారిపై మీ అభిప్రాయం చెప్పాలని లెటర్ పంపించారని చెప్పారు. విద్యుత్ కమీషన్‌కు నా దగ్గర ఉన్న సమాచారాన్ని ఇస్తానని, కమీషన్‌కు వాంగ్మూలం ఇచ్చిన వారి తప్పులను బయటపెడతానని కీలక వ్యాఖ్యలు చేశారు. ఛత్తీస్ గఢ్ మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్, విద్యుత్ అధికారుల నుండి కమీషన్ సమాచారం తీసుకోవాలని సూచించారు.