NTV Telugu Site icon

Jagadish Reddy : విచారణ కమిషన్ పారదర్శకంగా విచారణ చేయటం లేదు

Jagadish Reddy

Jagadish Reddy

విద్యుత్ విచారణ కమిషన్‌పై మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఇవాళ మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ.. విచారణ కమిషన్ కేసిఆర్ పైన అనవసర ఆరోపణలు చేస్తుందన్నారు. విచారణ కమిషన్ పారదర్శకంగా విచారణ చేయటం లేదని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం గత బీ ఆర్ ఎస్ పైన బురద జల్లె ప్రయత్నం చేస్తోందని, కేసీఆర్ పైన, గత ప్రభుత్వం పైన చేసిన అభివృద్ది పై ఆరోపణలు చేస్తోందని ఆయన మండిపడ్డారు. విద్యుత్ కొనుగోళ్ల పై ఉన్న విచారణ చేయిస్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాధనం దుర్వినియోగం జరగలేదు, ఒప్పందాల మేరకే ప్రాజెక్టులు జరిగాయని కేసిఆర్ లేఖ రూపం లో చెప్పారని, ఇందులో అవినీతి జరిగింది, కోట్ల రూపాయలు కూడబెట్టారు అంటూ ఆరోపిస్తున్నారన్నారు. నియమాలకు విరుద్ధంగా కమిషన్ వ్యవహరిస్తుందని జగదీష్‌ రెడ్డి అన్నారు. కమిషన్ న్యాయ బద్దంగా విచారణ చేయాలని, ఎలాంటి ఒత్తిడి లేకుండా వివక్ష లేకుండా పారదర్శకంగా విచారణ చేయాలన్నారు. నల్లగొండ లో ప్రోజెక్ట్ ఎందుకు పెట్టారు అని కొంత మంది ప్రశ్నిస్తున్నారని, నల్లగొండ లో యాదాద్రి ప్రోజెక్ట్ ను వ్యతిరేకించే వారిని చెప్పుతో కొడుతామన్నారు.

 

నల్లగొండ అభివృద్ది చెందకూడదా? అని ఆయన ప్రశ్నించారు. ఉద్యమం లో ముందుంది నల్లగొండ జిల్లా అని ఆయన వ్యాఖ్యానించారు. ఫ్లోరోసిస్ ను తరిమింది కేసీఆర్ అని ఆయన అన్నారు. కోదండరామ్ కి నల్లగొండ అభివృద్ది చెండకూడదు అని ఉందా? అని ఆయన ప్రశ్నించారు. కోదండరామ్ కు వందశాతం అవగాహన లేదని ఆయన అన్నారు. ఏదో చిన్న పదవి కోసం ఇష్టానుసారంగా ఆరోపణలు చేస్తున్నాడని, ఒక ఎమ్మెల్సీ కోసం ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నాడన్నారు. అనవసర ఆరోపణలు చేయటం మంచిది కాదు కోదండరామ్ కు అని ఆయన అన్నారు.