NTV Telugu Site icon

Jagadish Reddy : కేంద్ర ప్రభుత్వంతో సీఎం రేవంత్ లాలూచీ పడి ప్రాజెక్ట్‌లను అప్పగించారు

Ex Minister Jagadish Reddy

Ex Minister Jagadish Reddy

సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్ పై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్‌ అయ్యారు. ఇవాళ సూర్యాపేట జిల్లా జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. కృష్ణా ప్రాజెక్ట్ లను కేంద్రానికి అప్పగించి అన్యాయం చేసిన కాంగ్రెస్ ప్రభత్వానికి ప్రజలు చెప్పు దెబ్బలు కొడతారన్నారు. తమ వైఫల్యాల నుంచి తప్పించుకునేందుకు సీఎం రేవంత్.. కేసీఆర్ పై ఎదురు దాడికి దిగుతున్నారని ఆయన మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వంతో సీఎం రేవంత్ లాలూచీ పడి ప్రాజెక్ట్ లను అప్పగించారని, కేసీఆర్ మాట్లాడక ముందే కాంగ్రెస్ నేతలు ఉలిక్కి పడుతున్నారన్నారు. కృష్ణా జలాల విషయంలో ప్రాజెక్ట్ లు అప్పగించి కాంగ్రెస్ రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిందని ఆయన ధ్వజమెత్తారు.

 
తెలంగాణకు అసలైన ద్రోహులు కాంగ్రెస్ నేతలు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా జలాలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అసెంబ్లీలో మేమే నిలదీస్తాం, ఎవరు ద్రోహులు తేల్చుకుందామని, కేంద్రానికి తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టారన్నారు. 20 ఏళ్లుగా ప్రజల కోసం కొట్లాడింది, రాష్ట్రానికి నీళ్ళు తెచ్చింది కేసీఆర్ అన్నారు. కేసీఆర్ వచ్చాకనే రాష్ట్రంలో పంటలు పండాయన్నారు. కేంద్రంతో లాలూచీ పడి ప్రాజెక్టులు అప్పగించింది మీరు అని రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆరోపించారు. మారు వేషాలు వేసుకొచ్చి మాట్లాడి తప్పించుకోవాలి అనుకుంటున్న పాపాల భైరవులు మీరు అని రేవంత్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు జగదీష్ రెడ్డి.