Site icon NTV Telugu

Jagadish Reddy : మంత్రి హోదాలో కోమటిరెడ్డి ప్రవర్తన ఆటవికంగా ఉంది

Jagadesh Reddy

Jagadesh Reddy

మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పై సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి ఫైర్‌ అయ్యారు. ఇవాళ ఆయన సూర్యాపేటలో మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి హోదాలో కోమటిరెడ్డి ప్రవర్తన ఆటవికంగా ఉందన్నారు. యాదాద్రి జిల్లా పరిషత్ చైర్మన్ సందీప్ రెడ్డి పై కోమటిరెడ్డి, ఆయన అనుచరులు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాని ఆయన తెలిపారు. మంత్రి అయిన తర్వాత బుద్ధి మారుతుంది అనుకుంటే ఇంకా హీనంగా ఉందని జగదీశ్‌ రెడ్డి మండిపడ్డారు. మాధవరెడ్డి పేరు చెప్పుకుని, ఆయన అనుచరులకు సిగరెట్లు మోసి బతికిన చరిత్ర వెంకట్ రెడ్డి ది అని ఆయన విమర్శించారు. అంతేకాకుండా.. కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్ నుండి తొలగిస్తాడనే దొంగ దీక్ష అని, రేవంత్ బెడ్ రూమ్ లోకి పోయి కాళ్లు పట్టుకుంటేనే వెంకట్ రెడ్డికి మంత్రి పదవి వచ్చిందన్నారు జగదీశ్‌ రెడ్డి.

Read Also: Shivani Nagaram : ఫ్రెండ్ పాత్ర అనుకుని వెళ్తే “అంబాజీపేట మ్యారేజి బ్యాండు”కి హీరోయిన్ ను చేసేశారు!

కేసీఆర్ కేటీఆర్ ల గురించి మాధవ గురించి మాట్లాడే హక్కు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి లేదని, మేమంతా ఉద్యమం చేస్తుంటే రాజశేఖర్ రెడ్డి బూట్లు నాకిన వ్యక్తి కోమటిరెడ్డి అని ఆయన తీవ్రం ధ్వజమెత్తారు. అత్యుత్సాహం ప్రదర్శించిన పోలీసులపై రాచకొండ కమిషనర్ డిజిపి లు చర్యలు తీసుకోవాలని, సందీప్ రెడ్డిని రక్షించాల్సిన పోలీసులే నెట్టి వేయడం దారుణమన్నారు. పథకాల గురించి ప్రజలు ఎక్కడ నిలదీస్తారో అనీ పథకం ప్రకారమే కాంగ్రెస్ నాయకులు డ్రామాలు ఆడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆటవిక మాటలు చేతలు మానుకోకపోతే తగిన మూల్యం తప్పదని ఆయన అన్నారు.

 

Exit mobile version