NTV Telugu Site icon

Dhoni Jadeja: గురువుకు తగ్గ శిష్యుడు.. ఆ విషయంలో ధోనిని సమం చేసిన జడ్డు భాయ్..!

6

6

రవీంద్ర జడేజా.. జడ్డు భాయ్.. ఇలా పేరు ఏదైనా క్రికెట్ అభిమానులకు ఈయన గురించి కొత్తగా పరిచయం అక్కరలేదు. రవీంద్ర జడేజా ఆల్ రౌండర్ కావడంతో అటు బ్యాట్ లో, ఇటు బాల్ తో రాణించగల ధీరుడు. ఇక మ్యాచ్ సమయంలో.. అతని చుట్టూ ఒక వైఫై జోన్ ఉంటుంది. దాంతో మ్యాచ్ లో ఎక్కడా లేని ఎనర్జీ తన చుట్టూ ఉంటుంది. మ్యాచ్ ఎంత సీరియస్ అయినా సరే, తను చేయగల పనిని శాయశక్తులా చేసి తాను ఒత్తిడి నుంచి రిలీఫ్ అవుతారు. అంతేకాకుండా.. తనతోపాటు మరింత కొంతంది సహా ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసంతో, రెట్టించిన ఉత్సాహంతో ఆటాడుతారు. ఇదే రవీంద్ర జడేజాకు ఉన్న అసలైన బలం.

Also read: TDP: విరాళాల కోసం ప్రత్యేక వెబ్సైట్ను రూపొందించిన టీడీపీ.. మొదటి డొనేషన్ ఎంతో తెలుసా..?

ఇకపోతే.. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ లో రవీంద్ర జడేజా సీఎస్ కు తరఫున గురువు ధోనీతో కలిసి ఆడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా జరిగిన కోల్కతా నైట్ రైడర్స్ తో మ్యాచ్ లో రవీంద్ర జడేజా అద్భుతంగా బౌల్ చేసి, 3 వికెట్లు తీసి, ఆ జట్టుని తక్కువ స్కోరుకి కట్టడి చేయడంలో విజయం సాధించాడు. ఈ దెబ్బతో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు’ కూడా అందుకున్నాడు. ఇక అసలు విషయానికి వస్తే.. ఐపీఎల్ లో జడేజా సీఎస్కే తరఫున 15వ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను అందుకున్నాడు.

Also read: MS Dhoni: అయ్యబాబోయ్.. ధోని ఓ రేంజ్ లో అభిమానులను ప్రాంక్ చేసేసాడుగా..!

ఈ అవార్డుతో తను గురువు ధోనీ సరసన జడ్డు భాయ్ చేరిపోయాడు. దీనికి కారణం ధోనీ కూడా ఇంతవరకు 15 సార్లు మాత్రమే ఈ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను అందుకున్నాడు. ఒకవేళ తర్వార్హ జరిగే మ్యాచ్ లలో మరొక్కటి అవార్డు సాధిస్తే గురువును మించిన శిష్యుడైపోతాడు. ఇక వీరిద్దరి తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ‘అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు’ అందుకున్నవారిలో సురేశ్ రైనా (12), రుతురాజ్ (10), మైక్ హస్సీ (10) లు వరుసగా ఉన్నారు.

Show comments