Site icon NTV Telugu

Anirudh Reddy: చంద్రబాబు కోవర్టులు తెలంగాణలో ఉన్నారు.. ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి హాట్ కామెంట్స్!

Anirudh Reddy, Jadcherla Mla

Anirudh Reddy, Jadcherla Mla

జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. బనకచర్ల ప్రాజెక్టు విషయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్న లెటర్లు రాసుడు కాదుని, ఏపీ సీఎం చంద్రబాబు కోవర్టులు తెలంగాణలో ఉన్నారన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులు, రోడ్డు కాంట్రాక్టులు చూసేది వాల్లే అని విమర్శించారు. ఆ కోవర్టులకు కరెంట్ కనెక్షన్, నల్లా కనెక్షన్‌లు కట్ చేయండని విజ్ఞప్తి చేశారు. మంచిగ మాట్లాడితే ఆంధ్ర వాళ్లు మాట వినరు అని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి పేర్కొన్నారు.

Also Read: Revanth Reddy: ఒక్క నెల ప్రభుత్వ ఆసుపత్రిలో పని చేయండి.. వైద్యులకు సీఎం విజ్ఞప్తి!

‘బనకచర్ల ప్రాజెక్టు విషయంలో ఎమ్మెల్యేగా ఒక సూచన చేస్తున్నా. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్న లెటర్లు రాసుడు కాదు. సీఎం చంద్రబాబు కోవర్టులు తెలంగాణలో ఉన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులు, రోడ్డు కాంట్రాక్టులు చూసేది వాల్లే. ఆ కోవర్టులకు కరెంట్ కనెక్షన్, నల్లా కనెక్షన్‌లు కట్ చేయండి. ఇరిగేషన్ ప్రాజెక్టు పైసలు ఒక్క రూపాయి ఇవ్వకండి. వాల్లే చంద్రబాబు వద్దకు వెళ్లి కాళ్లు పట్టుకొని బనకచర్ల బంద్ పెట్టిస్తారు. మంచిగ మాట్లాడితే ఆంధ్ర వాళ్లు మాట వినరు’ అని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Exit mobile version