Site icon NTV Telugu

SpiceJet Flight: 5 వేల అడుగుల ఎత్తులో విమానం..క్యాబిన్ లో పొగలు

Spice Jet Flight

Spice Jet Flight

స్పైస్ జెట్ విమానానికి ప్రమాదం తప్పింది. గాలిలో ఉండగా క్యాబిన్ లోకి పొగలు వ్యాపించడంతో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు పైలెట్లు. ఢిల్లీ నుంచి మధ్య ప్రదేశ్ జబల్ పూర్ కు వెళ్తున్న స్పైస్ జెట్ విమానంలో అకాస్మత్తుగా పొగలు వచ్చాయి. క్యాబిన్ మొత్తం పొగతో నిండిపోయింది. దీంతో  ప్రయాణికులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. పొగ కారణంగా ప్రయాణికులు ఊపిరి పీల్చుకోలేని పరిస్థితి ఏర్పడింది. శనివారం ఉదయం ఢిల్లీ నుంచి బయలుదేరిన విమానం 5000 అడుగుల ఎత్తులోకి చేరుకోగానే పొగలు వ్యాపించాయి. దీంతో అత్యవసరంగా ఢిల్లీ విమానాశ్రయంలో ల్యాండింగ్ చేశారు. ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నట్లు స్పైస్ జెట్ ప్రతినిధి ఒకరు వెల్లడించారు.

 

Read Also:SpiceJet Flight: ఇంజిన్ లో మంటలు.. పాట్నాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్

స్పైస్ జెట్ విమానం ఇలా ప్రమాదాన్ని ఎదుర్కొనడం 15 రోజుల్లో ఇది రెండో సారి. ఇటీవల బీహార్ రాజధాని పాట్నా నుంచి ఢిల్లీకి బయలుదేరిన విమానం పక్షిని ఢీకొట్టడంతో ఎడమ ఇంజిన్ కు మంటలు వ్యాపించాయి. పైలెట్లు సేఫ్ గా ల్యాండింగ్ చేయడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఎడమ ఇంజిన్ మంటలు వ్యాపించడంతో ఇంజిన్ కు వెళ్లే ఇంధనాన్ని నిలిపివేసి పెద్ద ప్రమాదాన్ని తప్పించారు పైలెట్లు. టేకాఫ్ అయిన వెంటనే, పాట్నా ఎయిర్ పోర్టుకు సమీపంలో ఈ ఘటన జరిగింది. గాల్లో విమానం ఉండగానే ఎడమ ఇంజిన్ కు మంటలు అంటుకున్నాయి. ఒకే ఇంజిన్ తో ఫ్లైట్ ను ల్యాండ్ చేశారు.

 

 

 

Exit mobile version