Site icon NTV Telugu

Tripti Dimri : దారుణంగా ట్రోల్ అవుతున్న యానిమల్ బ్యూటీ.. పోర్న్ గర్ల్ అంటూ..

Tripti Dimri

Tripti Dimri

Tripti Dimri : తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన యానిమల్ సినిమాతో ఒక్కసారిగా పాపులర్ ఐపోయిన హిందీ హీరోయిన్ త్రిప్తి దిమ్రిని. ప్రస్తుతం ఈ పేరు బాలీవుడ్ లో బాగా వినిపిస్తోంది. దీనికి కారణం ఆమె నటించిన ” జానమ్ ” పాట సోషల్ మీడియా వేదికగా విడుదలవ్వడమే. ఈ వీడియోని చూసిన నెటిజన్స్ అసలు ఆమె ఇంతకు దిగజారాల్సిన అవసరమేంటంటూ ప్రశ్నిస్తున్నారు. ధర్మ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ” బ్యాడ్ న్యూస్ ” సినిమా జూలై 19 విడుదల కాబోతోంది. ఈ సినిమాలో హీరోగా విక్కీ కౌశల్ లీడ్ రోల్ పోషిస్తుండగా ఆయన సరసన త్రిప్తి డిమ్రీ, అమీ వర్క్ ప్రధాన పాత్రల్లో నటించారు.

Sai Pallavi : నా డ్రీమ్ రోల్ అదే.. ఓపెన్ ఐన హైబ్రీడ్ పిల్ల..

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్, ట్రైలర్లు సినిమాపై ఆసక్తిని పెంచగా.. తాజాగా విడుదలైన రెండు పాటలను చూస్తే మాత్రం సినిమాకు మరింత డోస్ పెంచేలా ఉన్నాయి. మొదటి పాట తౌబా తౌబా కి మంచి రెస్పాన్స్ రాగా రెండో పాటకు మాత్రం చాలా నెగెటివిటీ వచ్చింది అని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అందులో నటించిన హీరో హీరోయిన్స్ చాలా బోల్డ్ సన్నివేశాల్లో నటించారు. ఈ పాటలో చాలా బెడ్రూమ్ సీన్స్ ఉన్నాయి. ఇప్పటివరకు ఏ బాలీవుడ్ సినిమాల్లో కూడా ఇలాంటి బోల్డ్ సీన్స్ ఉండకపోవడంతో అభిమాన ప్రేక్షకులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ పాటకు సంబంధించి సినిమా మేకర్స్ ను అలాగే అందులో నటించిన హీరో హీరోయిన్లను దారుణంగా టోల్ చేస్తున్నారు నెటిజన్స్. ఈ పాటకు ప్రేక్షకులు ” వల్గర్ ” అనే ట్యాగ్ ను కూడా జత చేస్తున్నారు. ఇక హీరోయిన్ త్రిప్తి దిమ్రిని ఏకంగా ” పోర్న్ గర్ల్ ” గా ముద్ర వేసేస్తున్నారు.

Kisan Vikas Patra : 115 నెలల్లో మీ డబ్బు రెట్టింపు.. వివరాలు ఇలా..

Exit mobile version