Viral Video: సోషల్ మీడియాలో ఎప్పటికీ వైరల్ అయ్యే వీడియోలు ఏవైనా ఉన్నాయంటే.. అవి జంతువులకు సంబంధించిన వీడియోలైతేనే ఎక్కువగా వైరల్ అవుతాయి. అందులో కొన్ని భయంగా ఉంటే మరికొన్ని కామెడీగా ఉండే వీడియోలు ఉంటాయి. ఎక్కువగా ఫోన్లలో కానీ టీవీల్లో కానీ జంతువులకు సంబంధించిన వీడియోలు చూడటానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇక జంతువుల వేటకు సంబంధించిన వీడియోలైతే నెట్టింట సందడి చేస్తాయి.
Read Also: Adipurush Pre Release Event Live Updates : కమ్మేసిన ఆదిపురుష్ మేనియా..
తాజాగా ఓ వీడియో తెగ వైరల్ అవుతుంది. ఆ వీడియో చూస్తే గుండె గుబేలుమంటుంది. ఈ వీడియోలో ఓ దున్నను సింహాలు వెంటాడుతున్నాయి. ఏ జంతువుకు భయపడని సింహం ఎలాంటి దాన్నైనా తిమ్మిని భమ్మి చేయగలదు. ఎంత పెద్ద జంతువు కానీ సింహం కంట పడ్డాయంటే దాని నుంచి తప్పించుకోవడం కష్టమే ఇంకా. ముఖ్యంగా మగ సింహాలు చాలా అరుదుగా వేటాడుతాయి. ఎక్కువగా ఆడ సింహాలే వేటకు వెళ్తూ ఉంటాయి.
Read Also: Siddarth : శర్వానంద్ పెళ్లిలో ఆ పని చేసి అందరికి షాక్ ఇచ్చిన సిద్దార్థ్?
తాజాగా వైరల్ అవుతోన్న వీడియోలో దాదాపు 10 సినిమాలు ఓ అడవి దున్నను చుట్టుముట్టాయి. ఇంక తన పని అయిపోందనుకున్న దున్న.. గట్టిగా ధైర్యం తెచ్చుకున్నట్టుంది. సింహాలన్నీ చుట్టూ చేరి దాడికి ప్రయత్నిస్తున్నా.. ఆ దున్న మాత్రం దైర్యంగా వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధమైంది. ఆ దున్న సింహాలనుంచి తప్పించుకునేందుకు పక్కనే ఉన్న నీటి కొలనులోకి దిగి వెళ్తుంది. సింహాలు నీటిలోకి రావు కదా.. అందుకే దైర్యంగా ఆ నీటిలోకి దిగి సింహాలనుంచి తప్పించుకుంది అడవి దున్న. నీటిలోకి దిగిన దున్న.. ఇప్పుడు రండిరా అన్నట్టు ఓ లుక్ ఇచ్చింది. తెలివిగా ఆ దున్న సింహాలనుంచి తప్పించుకున్న వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.